ఆ సినిమాలో హీరో సొంత డబ్బులే

Update: 2018-07-02 08:00 GMT
ఇంతకుముందు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు అల్లుళ్లు కూడా కథానాయకులుగా మారుతున్నారు. ఈ ఒరవడి సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబుతో మొదలైంది. అతను ‘ఎస్ ఎంఎస్’ సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థపై ఆర్.బి.చౌదరి నిర్మించారు. ఐతే ఇది పోస్టర్ వరకేనట. నిజానికి ఈ చిత్రంలో సుధీర్ బాబే సొంతంగా డబ్బులు పెట్టాడట. ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సుధీర్ బాబే స్వయంగా వెల్లడించాడు.

హీరో కావాలనే ప్రయత్నంలో ఉండగా.. దర్శకుడు తాతినేని సత్య వచ్చి తమిళంలో హిట్టయిన ‘ఎస్ ఎంఎస్’ సినిమాను రీమేక్ చేద్దామన్నాడని.. దీంతో తనే స్వయంగా డబ్బులు సమకూర్చి ఆ సినిమా చేశానని సుధీర్ చెప్పాడు. కానీ ఆ చిత్రం తనకు నష్టాలు తెచ్చిపెట్టిందని.. ఆ బాధ నుంచి బయటపడటానికి  రెండేళ్లు పట్టిందని అతనన్నాడు. ‘ఎస్ ఎంఎస్’ అనుభవం ప్రేక్షకులు ముందు మనలోని హీరోను కాకుండా నటుడిని చూస్తారని అర్థమైనట్లు సుధీర్ చెప్పాడు. ఆ తర్వాత దర్శకుడు మారుతి తనకు కొన్ని కథలు చెప్పాడని.. ఐతే కమర్షియల్ సినిమా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమా మంచిదని ‘ప్రేమకథా చిత్రమ్’ ఎంచుకున్నానని.. ఆ సినిమా తనకు మంచి ఫలితాన్నిచ్చిందని చెప్పాడు. ‘ఎస్ ఎంఎస్’ సినిమా ఆడకపోయినా.. ఆ సినిమా చివర్లో తాను చూపించిన మార్షల్ ఆర్ట్స్ క్లిప్స్ చూసి హిందీ సినిమా ‘బాగీ’లో ఛాన్స్ ఇచ్చారని.. ఆ సినిమా చూసి తనలో ఏదో టాలెంట్ ఉందని తెలుగు దర్శక నిర్మాతలు నమ్మారని.. ఆ క్రమంలోనే ‘శమంతకమణి’లో ఛాన్సొచ్చిందని.. అందులో తనను చూసి ఇంద్రగంటి మోహనకృష్ణ ‘సమ్మోహనం’లో అవకాశం ఇచ్చారని సుధీర్ తెలిపాడు.
Tags:    

Similar News