ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోలెవరు? అంటే.. మహేష్ తర్వాత సుధీర్ బాబు పేరు వినిపిస్తుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ స్టార్ డమ్ ముందు ఎవరి స్టార్ డమ్ కనిపించడం లేదు. ఇక మహేష్ బావగారు సుధీర్ బాబు హీరో అయ్యి కెరీర్ ఎదుగుదల కోసం స్వయంకృషితో ముందుకెళుతున్నాడు. అసలు మీకు బావ సపోర్ట్ ఎంత? అని నేడు సుధీర్ ని తెలుగు సినీమీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందన అంతే పెద్ద షాకిచ్చింది.
ఓ రకంగా అసలు బావ నుంచి స్పందన అనేదే ఉండదు. ``తనలో భయం ఉంటుంది. కానీ దానిని బయటకు చూపించరు. మహేష్ గొప్ప నటుడు``! అనీ అన్నారు. అయితే సుధీర్ నోట వినిపించిన ఈ మాటకు అర్థం ఏంటి? బావపై గుంభనగా అంత మాటనేశాడేంటి? అంటూ అనుకున్నారంతా. అయితే దీనర్థం సుధీర్ విడమర్చిన తీరు అందరినీ తెగ నవ్వించేసింది.
నేను సక్సెస్ అవుతానో లేదో అనేది బావ భయం. అందుకే బయటపడడు.. నటిస్తాడు!! అని నవ్వేస్తూ వివరణ ఇచ్చాడు. అన్నట్టు తనకు తొలి సినిమా చేస్తున్నప్పుడు బావ నుంచి సపోర్టు అంతంత మాత్రమే. దానికి కారణం సక్సెస్ అవుతాడా.. అవ్వడా అనే సందేహమేనట. ఇకపోతే ఎస్ ఎంఎస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన సుధీర్ సక్సెసయ్యాక మాత్రం కాస్తో కూస్తో ప్రమోషన్ చేసిపెడుతున్నాడు బావ మహేష్. ఇకపోతే ఇప్పుడు సుదీర్ సొంతంగా ఎస్ బి ప్రొడక్షన్స్ ప్రారంభించి బ్యానర్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు కదా.. దీనికైనా బావ నుంచి సపోర్టు ఉందా? అంటే సుధీర్ స్వయంకృషితో ఎదిగేప్పుడు సపోర్టు ఎందుకులే అనే అనుకుంటున్నాడట. ఆ మాటను సరదా సరదాగా నవ్వేస్తూనే గుంభనగా చెప్పాడు సుధీర్. ఓరయ్యో బావ- బావమరుదుల మధ్య సరసం విరసం చాలానే ఉందని మీడియా జనం గుసగుసలాడుకున్నారు. బావుంది బావ గారూ!! మీ సరసం.