‘సమ్మోహనం’ చిత్రంతో ఎట్టకేలకు సక్సెస్ ను దక్కించుకున్న సుధీర్ బాబు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. కాని తాజాగా శైలజ రెడ్డి అల్లుడు విడుదల వాయిదా పడటంతో పాటు - సెప్టెంబర్ 13కు ఫిక్స్ అయ్యింది. తాజాగా దర్శకుడు మారుతి ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాన్ని సెప్టెంబర్ 13న వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఈ సమయంలో సుధీర్ బాబు సినిమా వస్తే ఖచ్చితంగా ఓపెనింగ్స్ విషయంలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే సుధీర్ బాబు ఒక వారం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి.
నాగచైతన్యతో పోల్చితే సుధీర్ బాబు మార్కెట్ కాస్త తక్కువే అని చెప్పుకోవాలి. అందుకే శైలజ రెడ్డి అల్లుడు విడుదలైన రోజే ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంను విడుదల చేయడం వల్ల ఓపెనింగ్స్ విషయంలో తేడా కొట్టే అవకాశం ఉంది. అయినా కూడా మొండి ధైర్యంతో సుధీర్ అదే రోజున విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తాజాగా ముందు అనుకున్నట్లుగానే వస్తున్నాం అంటూ సుధీర్ చెప్పకనే చెప్పాడు. కాని ఇన్ సైడ్ టాక్ ఏంటీ అంటే సుధీర్ బాబు తన సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు అని, కాకుంటే చివరి నిమిషంలో విడుదల వాయిదాను ప్రకటించాలని సుదీర్ భావిస్తున్నాడు అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సెప్టెంబర్ 13న నాగచైతన్య ‘శైలజ రెడ్డి అల్లుడు’ - సమంత ‘యూటర్న్’ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో తన నన్ను దోచుకుందువటే చిత్రం విడుదల అవ్వడం ఆత్మహత్య సదృష్యం అనే విషయం సుధీర్ బాబుకు కూడా తెలుసు. అందుకే సెప్టెంబర్ 21న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడని సినీ వర్గాల వారు అంటున్నారు. కాని ఆ విషయాన్ని సెప్టెంబర్ 5 లేదా 6న ప్రకటించాలని - అప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లాలని సుధీర్ చిత్ర యూనిట్ సభ్యులకు చెప్పాడని - సినిమా విడుదల విషయంలో చాలా ప్లాన్డ్ గా సుధీర్ బాబు వ్యవహరిస్తున్నారు అంటూ ఫిల్మ్ నగర్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.