మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ప్రకటన వచ్చింది. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 2 అని ప్రకటన ఇచ్చారు. ఈ సినిమాకు పులి వాసు దర్శకత్వం వహిస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ సినిమాలో హీరోయిన్ మెహ్రీన్ అనే అంటున్నారు.
ఈ కాంబినేషన్ అంతా చూస్తుంటే కొన్నివారాల క్రితం సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా ప్రారంభం అయిన సినిమాను గుర్తు చేసుకుంటున్నారు ఫిలిం నగర్ జనాలు. అంటే ఒక్క హీరో మాత్రం మారాడు.. మిగతా అంతా సేమ్ టూ సేమ్. సుధీర్ బాబు సినిమాను లాంచ్ చేశారు గానీ పట్టాలెక్కలేదు. సినిమా చేయనని చెప్పి నిర్మాతకు అడ్వాన్సు కూడా వెనక్కు ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే సినిమాను మెగా అల్లుడికి ఫిక్స్ చేశారని అంటున్నారు.
ఒక హీరో అనుకున్న సినిమా మరో హీరో చేయడం ఇండస్ట్రీలో సహజంగా జరిగేదే. ఇందులో వింతేమీ లేదుగానీ.. ఈ సినిమా ఓకే అయిందంటే ఖచ్చితంగా మెగాస్టార్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉండాలి. మరి అలాంటి స్టఫ్ ఉన్న కథను సుధీర్ బాబు ఎందుకు వదిలేసినట్టో..!