సుధీర్-శర్వా.. ఒక మాఫియా కథ

Update: 2017-08-28 07:09 GMT
త్వరలోనే ‘మహానుభావుడు’గా పలకరించబోతున్నాడు శర్వానంద్. ఆ తర్వాత శర్వా ఒకటికి రెండు సినిమాలకు కమిటయ్యాడు. అందులో ఒకటి రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించే సినిమా కాగా.. మరొకటి ‘స్వామి రారా’.. ‘కేశవ’ చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మతో చేయబోయేది. ఇందులో ముందుగా సుధీర్ వర్మ సినిమానే మొదలవుతుంది. క్రైమ్ థ్రిల్లర్లంటే చాలా మక్కువ చూపించే సుధీర్ వర్మ.. శర్వాతో సినిమాను కూడా ఆ బ్యాక్ డ్రాప్ లోనే తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో సాగుతుందట. శర్వా ఇందులో సామాన్యుడి స్థాయి నుంచి మాఫియా అధినేతగా ఎదిగిన వ్యక్తి పాత్రలో కనిపిస్తాడట.

ఒక వ్యక్తి జీవితంలోని వివిధ దశల్ని ఈ సినిమాలో చూపిస్తారని.. శర్వా వివిధ వయసుల్లో కనిపిస్తాడని.. నడి వయస్కుడిగా కనిపించే దశ ఆసక్తికరంగా ఉంటుందని ఈ చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్లోనే ఈ చిత్రం పట్టాలెక్కుతుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి. ‘స్వామి రారా’తో టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ వర్మ.. ‘దోచేయ్’తో ఎదురు దెబ్బ తిన్నాడు. తన తొలి చిత్ర కథానాయకుడు నిఖిల్‌ తో అతను తీసిన ‘కేశవ’ మూణ్నెల్ల కిందటే విడుదలైంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. పెద్ద హిట్ కాకపోయినా.. సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకోవడంతో ఇక తన తర్వాతి సినిమా కోసం కాన్ఫిడెంట్ గా రంగంలోకి దిగేస్తున్నాడు సుధీర్.
Tags:    

Similar News