రొటీన్ కి భిన్నంగా.. కొత్తగా.. గమ్మత్తుగా ఉండే కథల్ని ఎంచుకుంటూ నవతరం దర్శకులు సర్ ప్రైజ్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ డికేడ్ ని ఇన్నోవేటివ్ డికేడ్ గా ప్రకటించినా తప్పేమీ కాదు. టాలీవుడ్ లో మునుపెన్నడూ లేనన్ని ప్రయోగాలు జరుగుతుండడం సరికొత్త పరిణామం. ప్రశాంత్ వర్మ అ!.. వెంకటేష్ మహా- కేరాఫ్ కంచర పాలెం.. తరుణ్ భాస్కర్ - పెళ్లి చూపులు ... గౌతమ్ తిన్ననూరి- జెర్సీ.. రితేష్ రానా- మత్తు వదలరా .. ఇలా పరిశీలిస్తే ఈ లిస్ట్ చాలా పెద్దదే. నవతరం దర్శకులు ఎంచుకున్న కాన్సెప్ట్.. స్క్రీన్ ప్లే పరంగానూ ప్రయోగాలు చేస్తూ సక్సెసవుతున్నారు. ఎంచుకుంటున్న కథా వస్తువు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో సుధీర్ వర్మ ఈ తరహాలో ప్రయోగాత్మక కథల్ని ఎంచుకున్నా.. ఎందుకనో ఆశించినంత సక్సెస్ కాలేకపోయాడు. అతడు తెరకెక్కించిన `స్వామి రారా` మాస్టర్ క్లాస్ సినిమాగా గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత తెరకెక్కించిన దోచెయ్-కేశవ- రణరంగం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కథల్ని సరిగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడన్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అతడిపై వచ్చింది.
అయితే పోగొట్టుకున్న చోటే రాబట్టుకునే ఆలోచనలో ఉన్నాడు సుధీర్ వర్మ. అందుకే ఈసారి కథ పరంగా ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా జాగ్రత్తపడుతున్నాడు. తదుపరి చిత్రానికి సొంత కథతో కాకుండా కొరియన్ బ్లాక్ బస్టర్ `హంజా`ని రీమేక్ చేసే సన్నాహకాల్లో ఉన్నాడు. 2017లో రిలీజైన ఈ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ పేరుతో హాలీవుడ్ లో రీమేకైంది. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసేందుకు సుధీర్ వర్మ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం ఎంతో ఆసక్తికరం. ఓ ఫెర్టిలిటీ సెంటర్ కోసం అమ్మాయిల ఎగ్స్ ని దొంగిలించే కిడ్నాపర్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రక్తి కట్టిస్తాయని తెలుస్తోంది. అయితే ఈ కథలో ఇద్దరు హీరోలు ఉండగా.. మన నేటివిటీకి తగ్గట్టుగా హీరో హీరోయిన్ బ్యాక్ డ్రాప్ కి మారుస్తున్నారట. కొత్తదనం నిండిన కథని ఎంచుకుని స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే సుధీర్ వర్మ హిట్ కొట్టే ఛాన్సుంది. ఈసారి అయినా ఆశించిన విజయం అందుకుంటాడా లేదా? ఏం జరగనుందో చూడాలి.