బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో చత్రపతి రీమేక్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా అయితే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కాని ప్రాజెక్ట్ విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదట ఈ రీమేక్ కోసం బాలీవుడ్ యంగ్ దర్శకుడిని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సాహో దర్శకుడు సుజీత్ ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది. కాని సుజీత్ చత్రపతి రీమేక్ లో భాగస్వామ్యం కావడం లేదని సమాచారం అందుతోంది.
ఆ రీమేక్ విషయమై మేకర్స్ సుజీత్ ను సంప్రదించిన విషయం నిజమేనట కాని అందుకు నో చెప్పాడట. సుజీత్ తన మూడవ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ లో చేసేందుకు ఒప్పందం కుదుర్చకున్నాడు. ఆ కారణంగానే రీమేక్ బాధ్యతలను తీసుకునేందుకు అయిష్టంగానే నో చెప్పాడట. యూవీ క్రియేషన్స్ లో వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. అదే సమయంలో చత్రపతి రీమేక్ కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నారట. కనుక రెండు సినిమాలను చేయడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో సుజీత్ అయిష్టంగా రీమేక్ ఆఫర్ ను వదిలేశాడని చెబుతున్నారు.
సుజీత్ నో చెప్పడంతో ఆ బాధ్యతలను ప్రభుదేవాకు అప్పగించేందుకు తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. పలు సౌత్ సినిమాలను బాలీవుడ్ లో డైరెక్ట్ చేసి సక్సెస్ లు దక్కించుకున్న ఘనత ప్రభుదేవకు ఉంది. అందుకే ఈ రీమేక్ బాధ్యతలను అప్పగిస్తే బెల్లంకొండుకు బాలీవుడ్ లో మంచి ఎంట్రీని ఇస్తాడని భావిస్తున్నారట. మరి ప్రభుదేవా ఒప్పుకుంటాడా అనేది చూడాలి.