ఈ శక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన `భీమ్లానాయక్` సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన మొదటిరోజు మొదటి ఆటతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకని ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది. ఊహించని విధంగా పవన్ హైవోల్టేజ్ పాత్రలో నటించడం తో ఈ మూవీ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ జాతర మొదలైంది.
'వకీల్ సామ్' వంవటి స్మాషింగ్ హిట్ తరువాత పవన్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో సినిమా వుండటంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రానకి బ్రహ్మరథం పడుతున్నారు.
మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియు` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర తెరకెక్కించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని క్రియేట్ చేస్తోంది.
ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ లో వున్న పవన్ కల్యాణ్ తాజాగా మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ భారీ లైనప్ తో వున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో రెండు రీమేక్ లని లైన్ లో పెట్టారట.
ఇప్పటికే రీమేక్ లతో వకీల్ సాబ్ , భీమ్లానాయక్ వంటి బ్లాక్ బస్టర్ లని సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్ అదే ఊపులో మరో రెండు రీమేక్ లకు సై అంటూ సైరన్ ఊదేశారట. తమిళంలో సముద్రఖని నటించిన తెరకెక్కించిన చిత్రం `వినోదాయ సితం`.
ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ రీమేక్ ని చేయడానికి పవన్ కల్యాణ్ ఓకే చెప్పేశారు. ఇప్పటికే ఈ మూవీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుని దీని బాధ్యతల్ని త్రివిక్రమ్ కి అప్పగించారట.
తాజాగా మరో తమిళ సినిమా రీమేక్ కి ఓకే చెప్పారని తెలిసింది. విజయ్ హీరోగా నటించిన `థేరీ`. ఈ మూవీని ఇప్పటికే తెలుగులో `పోలీసోడు` పేరుతో దిల్ రాజు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇదే చిత్రాన్ని త్వరలో రీమేక్ చేయబోతున్నారట. ఇందులో నటించడానికి పవన్ కల్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ రీమేక్ కి ప్రభాస్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. `సాహో` తరువాత మరో చిత్రాన్ని చేయని సుజీత్ కు ఇది నిజంగా బంపర్ ఆఫరే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. ఇప్పటికే రీమేక్ స్క్రీప్ట్ కి సంబంధించిన మార్పులు . చేర్పులు జరుగుతున్నాయని, హరి హర వీరమల్లు , హరీష్ శంకర్ `భవదీయుడు భగత్‌సింగ్` చిత్రాలు పూర్తి చేసిన తరువాతే పవన్ `థేరీ` రీమేక్ ని సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారని తెలిసింది.
ఇందులో నటించే హీరోయిన్ లు ఎవరు? .. తెలుగులో పవన్ ఇమేక్ కు తగ్గట్టుగా ఎలాంటి మార్పులు చేస్తున్నారన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.