1-నేనొక్కడినే డిజాష్టర్ తర్వాత దర్శకుడు సుకుమార్ చేస్తున్న తాజా ఎటెంప్ట్ నాన్నకు ప్రేమతో. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తండ్రి కొడుకుల అనబంధం నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమాకి సంబంధించి, సుక్కూ గురించి ఓ హాట్ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. అసలే ఈ సినిమా కథ రాయడానికి సుక్కూ తండ్రి గారైన తిరుపతిరావు ఇన్ స్పిరేషన్. తాను దర్శకుడు కాకముందు కాలేజ్ లెక్చరర్ గా ఉన్నప్పుడు, అంతకంటే ముందు కాలేజ్ విద్యార్థిగా ఉన్నప్పుడు తండ్రితో ఎంతో చనువుగా ఉండేవాడు. నాన్న అంటే ప్రాణం. అయితే 2014లో తన తండ్రి ఇహలోకాన్ని వీడి వెళ్లారు. అతడి జీవితంలో ఇదో కుదుపు లాంటిదే. నాగచైతన్యతో 100 పర్సంట్ లవ్ సినిమా తీసినపుడు.. ఆ సినిమా చివర్లో.. ''నాన్నకు ప్రేమతో -సుకుమార్'' అంటూ టైటిల్ వేసుకున్నాడు. అంటే ఆ సినిమా కథకూ తన తండ్రికీ ఏదో లింక్ ఉందేమో అనిపించింది.
అందుకు ఇప్పుడు ఎన్టీఆర్ ''నాన్నకు ప్రేమతో'' సినిమా సుక్కూ తన తండ్రికి ట్రైబ్యూట్ గా భావిస్తున్నారేమో అని అనిపిస్తోంది. ఇది ఎంతో సెంటిమెంటుతో కూడుకున్నది. సుక్కూ వ్యక్తిగత జీవితంలోని ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయని చెబుతున్నారు. అంటే సుక్కూ నిజజీవిత పాత్రలోనే ఎన్టీఆర్ కనిపిస్తున్నాడా? 8 జనవరి 2016లో ఈ సినిమా రిలీజ్ కానుంది. చూద్దాం అసలు విషయం అప్పుడు తెలుస్తుందిగా..