స్టార్ డైరెక్టర్లలో చాలా మంది దర్శకులు తమకు నచ్చిన, తాము మెచ్చిన టెక్నీషియన్ లని ప్రతీ సినిమాకు కంటిన్యూ చేస్తుంటారు. ఇలాంటి అలవాటు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, ఇంద్రగంటి మోహన కృష్ణ తో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు కూడా వుంది. సంగీత దర్శకుడు, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, లిరిక్ రైటర్.. ఇలా తమకు బాగా కనెక్ట్ అయిన టెక్నీషియన్ లని రిపీట్ చేస్తూ వుంటారు. అయితే సుకుమార్ మాత్రం దేవి శ్రీప్రసాద్ లేకుండా సినిమా చేయడం లేదు.
అది తాను సమర్పకుడిగా వ్యవహరించిన చిన్న సినిమా అయినా.. తాను డైరెక్ట్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ అయినా అయినా దేవి శ్రీప్రసాద్ వుండాల్సిందే. అంతగా ఇద్దరి మధ్య మంచి బాండింగ్. అంతకు మించిన స్నేహం ఏర్పడింది. ఆ కారణంగానే దేవి తనకు ఆత్మ లాంటి వాడంటూ చాలా సందర్భాల్లో సుకుమార్ వెల్లడించాడు కూడా. దేవి కూడా సుకుమార్ సినిమాలకు ప్రాణం పెట్టి పని చేస్తుంటాడు.
తన సంగీతంతో సినిమాలని హిట్ చేసిన సందర్భాలు కూడా వున్నాయంటే వీరిద్దరి మధ్య వున్న బాండింగ్ ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు. సుక్కు డైరెక్టర్ గా పరిచయమైన 'ఆర్య' మూవీ నుంచి దేవితో అనుబంధం కొనసాగుతోంది. సుక్కు సమర్పకుడిగా వ్యవహరించిన కుమారి 21 ఎఫ్, 'ఉప్పెన' వంటి సినిమాలకు దేవి అందించిన సంగీతం ప్రధాన హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడిగా వ్యవహరించిన ప్రతీ సినిమాని దేవి తన మ్యాజిక్ తో మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు.
సుకుమార్ చెప్పినట్టే అతనికి ఆత్మగా నిలిచాడు. అయితే అలాంటి ఆత్మని తాజాగా సుకుమార్ పక్కన పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుకుమార్ త్వరలో 'పుష్ప 2'ని ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీకి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. అంతే కాకుండా సుకుమార్ రైటింగ్స్ పై వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ మూవీకి దేవీని కాకుండా మరో సంగీత దర్శకుడిగా సుకుమార్ ఎంచుకోవడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి 'కాంతార' ఫేమ్ అంజనీష్ లోక్ నాథ్ ని తీసుకున్నారు. దేవిని ఈ మూవీ నుంచి తప్పించడానికి కారణం తను రూ. 4 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడమేనని ఇన్ సైడ్ టాక్.
అయితే మరో నిర్మాత అందుకు అంగీకరించినా సుకుమార్ మాత్రం ఓకే చెప్పలేదట. అంతే కాకుండా దేవి ప్లేస్ లో 'కాంతార' ఫేమ్ అంజనీష్ లోక్ నాథ్ ని తీసుకుందామని తనే చెప్పడంతో బీవీఎస్ ఎన్ ప్రసాద్ కూడా ఓకే చెప్పేశాడట. బడ్జెట్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశ్యం వల్లే సుకుమార్ తన ఆత్మగా భావిస్తున్న దేవిని పక్కన పెట్టాడని చెబుతున్నారు. మరి దేవి లేకుండా సుక్కు సినిమా ఎలా వుంటుందో ఫస్ట్ సింగిల్ లేదా.. టీజర్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.