మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు నిజమైన పుత్రోత్సాహంతో ఉన్నారు. ఆయన తనయుడు రామ్ చరణ్ ‘రంగస్థలం’లో ప్రదర్శించిన నట కౌశలానికి ప్రతి ప్రేక్షకుడూ ఫిదా అయిపోయాడు. చరణ్ అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు. చిరు నట వారసత్వాన్ని అందుకుని దశాబ్దం కిందట అరంగేట్రం చేసిన చరణ్.. ఎట్టకేలకు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇంకా వసూళ్ల లెక్కల్లో చూస్తే చరణ్.. తండ్రిని మించిన తనయుడని కూడా అనిపించుకున్నాడు కూడా. ఈ నేపథ్యంలో చిరు ఆనందం మామూలుగా లేదు. ‘రంగస్థలం’ విడుదలకు ముందే చిరు ఈ చిత్రాన్ని చూసి అమితానందానికి గురైనట్లు దర్శకుడు సుకుమార్ ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే.
అప్పుడు చిరు ఎలా రెస్పాండయ్యాడో తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెబుతూ.. ఒక సీన్ దగ్గర చిరు చాలా ఆశ్చర్యపోయినట్లు వెల్లడించాడు. ఇంట్లో రోజూ గిన్నెలు తోమడం.. వంట చేయడం అలవాటు ఉన్నట్లుగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో చరణ్ చాలా సహజంగా చేశాడని.. ఆ సీన్ చూసి చిరంజవి కూడా షాకైనట్లు సుకుమార్ వెల్లడించాడు. ‘నువ్వు చేసి చూపించి ఉంటావ్. కాబట్టే చరణ్ అంత బాగా చేశాడు’ అని సుకుమార్ తో చిరు అన్నాడట. ఐతే నిజంగా తాను చేసి చూపించలేదని.. పాత్రను అర్థం చేసుకుని చరణ్ అలా చేసుకుపోయాడని చిరుకు చెబితే.. ఆయన ఎంతకీ తన మాట నమ్మలేదని సుకుమార్ వెల్లడించాడు. కొన్ని సన్నివేశాల్లో చరణ్ నటన.. హావభావాలు తనకే చాలా షాకింగ్ గా అనిపించాయని సుకుమార్ తెలిపాడు.