టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఆర్య సినిమాతో కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. ఒక్కసారిగా సుకుమార్ పేరు మార్మోగిపోయింది. మరోవైపు హీరో రామ్ దేవదాసు సినిమాతో సినీరంగప్రవేశం చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. టీనేజ్ లోనే ఎంట్రీ ఇచ్చిన రామ్.. అప్పట్లో దేవదాసుగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే సుకుమార్ - రామ్ కాంబినేషన్ లో ఫస్ట్ సినిమాగా.. వారిద్దరి కెరీర్లో రెండో సినిమాగా తెరకెక్కిన సినిమా 'జగడం'. ఈ సినిమా విడుదలై మార్చ్ 16కి పద్నాలుగు సంవత్సరాలు ముగిసి పదిహేనో ఏడాది మొదలైంది. ఈ సందర్బంగా డైరెక్టర్ సుకుమార్ మరోసారి జగడం సినిమా గురించి, హీరో రామ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. జగడం సినిమా సమయంలోనే రామ్ చాలాపెద్ద హీరో అవుతాడని అనుకున్నాను. అప్పుడు అనుకున్నట్లుగానే ఇప్పుడు రామ్ మంచి యాక్టర్ గా ఉన్నాడు.
నిజానికి ఈ సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయినా హీరో, డైరెక్టర్ లకు మాత్రం క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పటికి జగడం మ్యూజిక్ ఆల్బమ్ ఎక్కడో ఓచోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమా గురించి ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటారు కానీ అప్పట్లో మాట్లాడి ఉంటే హిట్ అయ్యేదేమో అనిపిస్తుంది. ఈ సందర్బంగా సుకుమార్ స్పందించి.. 'నాకు ఈ సినిమా తెరకెక్కించే సమయంలో సెన్సార్ గురించి పెద్దగా తెలియదు. అందుకే సినిమాలో చాలా సీన్స్ కట్ అయ్యాయి. సినిమా సోల్ మిస్ అయింది. తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడటం ఆపేసా. కానీ ఓసారి ఫ్లైట్ లో ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కలిసి.. ముంబైలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ దగ్గర జగడం సీడీ ఉందని చెప్పాడు. అలాగే రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు హైలైట్. నిర్మాత జేడీ సోంపల్లి కొడుకు ఆదిత్యబాబు ఇప్పటికి టచ్ లోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు సుక్కు. అలాగే చివరిగా రామ్ తో జగడం రీమేక్ చేయాలనీ ఆలోచన ఉన్నట్లు చెప్పాడు సుకుమార్. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.