పుష్ప 2: ప‌ర‌భాషా ర‌చ‌యిత‌కు సుక్కూ వెల్ కమ్!?

Update: 2022-07-07 05:33 GMT
`పుష్ప` సీక్వెల్ అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సహా అభిమానుల్లో ఇది చ‌ర్చ‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఈ సినిమా బ‌డ్జెట్ రేంజ్ ను అమాంతం పెంచేయ‌డమే గాక‌.. పాన్ ఇండియా లెవ‌ల్లో కేజీఎఫ్ 2 ని కొట్టాల‌న్న పంతంతో సుక్కూ టీమ్ ప్లాన్ చేసింద‌ని టాక్ వినిపించ‌డ‌మే.

ఈసారి పుష్ప 2  బాక్సాఫీస్ ల‌క్ష్యం 1000 కోట్లు అని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఉత్త‌రాదిన ద‌క్షిణాది సినిమా మానియా కొన‌సాగుతోంది. దీనిని ఎన్ క్యాష్ చేయ‌డమే పుష్ప టీమ్ ల‌క్ష్యం. అయితే ఇది సాధించాలంటే క‌చ్ఛితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ బ‌డ్జెట్ రేంజును పెంచాలి. అలాగే యాక్ష‌న్ కంటెంట్ ప‌రంగా మ‌రో లెవ‌ల్ ని చూపించాలి. దానికి త‌గ్గ‌ట్టే సుక్కూ మైండ్ గేమ్ ఛేంజ్ చేసాడ‌న్న టాక్ ఇటీవ‌ల ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది.

పుష్ప 2 మూవీలో మూడు కీల‌క‌మైన మార్పుల కోసం స్క్రిప్టు ద‌శ‌లోనే సుకుమార్ వ‌ర్క్ చేస్తున్నారు. అతడు త‌న అసిస్టెంట్ రైట‌ర్ల‌తో క‌లిసి స్టంట్స్ ప‌రంగా మ‌రో లెవ‌ల్ ని ప్లాన్ చేసాడు. ఏ ఇత‌ర హాలీవుడ్ మూవీకి త‌గ్గ‌కుండా ఇందులో యాక్ష‌న్ ని డిజైన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి.

ఇప్ప‌టికే సుకుమార్ అసిస్టెంట్ రైట‌ర్ల‌కు సీన్ల‌కు సంబంధించిన‌ కొన్ని ప్ర‌ధాన ల‌క్ష‌ణాల‌పైనా ల‌క్ష్యాల‌పైనా దిశా నిర్ధేశ‌నం చేసారు. దీనివ‌ల్ల స్కిప్టు కోసం సీన్ల కోస‌మే చాలా చాలా స‌మ‌యం తీసుకుంటోంది. సుక్కూ ఐడియాల‌జీ ప్ర‌కారం.. యాక్ష‌న్ లో యూనిక్ థాట్స్.. హై డ్రామా.. శంక‌ర్ జెంటిల్ మేన్ రేంజులో.. పండాలన్న సూచ‌న అందింద‌ట‌.

హీరో - విల‌న్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ అనేది స్కై ని తాకాలి. ఆ ఇద్ద‌రూ ఎదురు ప‌డితే భీభ‌త్స‌మే అనేట్టుగా స‌న్నివేశాల్ని మ‌ల‌చాలి. అలాగే హీరో- హీరోయిన్ న‌డుమ‌ ఎమోష‌న్ ని సెంటిమెంట్ ని మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని చెప్పార‌ట‌. మొత్తానికి సుకుమార్
అసిస్టెంట్ రైట‌ర్ల‌కు పెద్ద ప‌ని అప్ప‌జెప్పాడు. వ‌రుస పెట్టి హాలీవుడ్ సినిమాలు చూసినా ఇక్క‌డ యూనిక్ థాట్స్ తో ఎక్స్ క్లూజివ్ గా సీన్స్ ని క్రియేట్ చేయ‌గ‌ల‌గాలి. అప్పుడు మాత్ర‌మే వంద‌ల కోట్లు కొల్ల‌గొట్టే విజ‌యం ద‌క్కుతుంది. ఇక ఈ మూవీలో ఫ‌హ‌ద్ ఫాజిల్ తో పాటు విజ‌య్ సేతుప‌తి కూడా విల‌న్ల గుంపులో చేరుతున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్న సంగ‌తి తెల‌సిందే.

ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల ర‌చ‌యిత‌ల‌తో?

ద‌ర్శ‌క‌ర‌చ‌యిత అయిన సుకుమార్ ఎంతో విల‌క్ష‌ణంగా ఆలోచిస్తున్నార‌ని తాజా లీక్ అందింది. పుష్ప ఫ్రాంఛైజీలో వ‌రుస సీక్వెల్స్ కోసం అత‌డు ఇప్ప‌టి నుంచే రైటింగ్ విభాగాన్ని ఎంతో ప‌టిష్ఠం చేసుకుంటున్నాడు. దానికోసం న‌వ‌త‌రం ట్యాలెంట్ ని ఆహ్వానిస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. పుష్ప సీక్వెల్ కోసం కొన్ని యూనిక్ మార్గాల‌ను సుకుమార్ అన్వేషిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను అభివృద్ధి చేయడానికి వివిధ భాష‌ల నుంచి రచయితలను ఆహ్వానిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

పుష్ప 2 స్క్రీన్ ప్లేకి సన్నివేశాలు రాయాలి. ర‌క‌ర‌కాల‌ ఎపిసోడ్ లు.. షాట్లు .. ఫ్రేమ్ లను కూడా అందించమని తెలుగు ర‌చ‌యిత‌ల‌నే కాకుండా భారతదేశంలోని ఇతర సినీ పరిశ్రమలకు చెందిన యువ రచయితలను కోరారని గుస‌గుస వినిపిస్తోంది.  ఈ ప‌ని చేసినందుకు సుక్కూ ముంద‌స్తుగానే పే చెక్ లు అందిస్తార‌ట‌. ఆపై తన చివరి డ్రాఫ్ట్ లో కొత్త ర‌చ‌యిత‌లు రాసే వాటి నుంచి ఛ‌మ‌క్కుల‌ను ఎంపిక చేసుకుంటారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ``స్క్రీన్‌ప్లే సూచనలను`` చేర్చాలనుకుంటున్నాడా లేదా అనే దానిపై తన విచక్షణా జ్ఞానాన్ని వినియోగించుకుంటాడ‌ట‌.

ప్ర‌ముఖ తెలుగు నిర్మాత మాట్లాడుతూ-``ఇది ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్లేతో నావ‌ల్టీ పాయింట్ తో తెర‌కెక్కే సినిమా. స్క్రీన్ ప్లేను మెరుగుపరిచే చాలా ఉత్పాదక మార్గాన్ని సుకుమార్ క‌నుగొన్నారు. ఈ విధంగా భావిత‌రం రచయితలు పని చేసే అవకాశాన్ని పొందుతారు. వారి పనికి మంచి వేతనం పొందుతారు``అని తెలిపారు. నిజానికి సుకుమార్ తన పుష్ప సీక్వెల్ కోసం కేవ‌లం తన స్వంత రచనా నైపుణ్యాలపై మాత్రమే ఆధారపడినట్లయితే అది వేరుగా ఉంటుంది. అంత‌కుమించి ఏదైనా పుష్ప సీక్వెల్ కోసం చేయాల‌నేది అత‌డి త‌ప‌న అని తెలిసింది. సీక్వెల్ స‌క్సెస్ ని బ‌ట్టి ఫ్రాంఛైజీ కొన‌సాగింపును కూడా దూర‌దృష్టితో చూడ‌టం వ‌ల్ల‌నే అత‌డు ర‌చ‌యిత‌లను ఆహ్వానిస్తున్నారన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News