రంగస్థలం రీ షూట్ కహాని

Update: 2018-03-20 06:14 GMT
వెండితెరపై రంగస్థలం జాతరకు సరిగ్గా 9 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆడియో - ప్రీ రిలీజ్ - ట్రైలర్ అన్ని లాంఛనాలు పూర్తి కావడంతో అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. కాన్సెప్ట్ లో ఉన్న కొత్తదనం సగటు ప్రేక్షకులకు కూడా దీని గురించి భారీ అంచనాలు పెట్టుకునేలా చేసింది. కాకపోతే ఏడాదిన్నర పాటు షూటింగ్ జరగడం పట్ల మాత్రం కొన్ని అనుమానాలు అలాగే మిగిలిపోయాయి. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అతిధి చిరంజీవి మాటలు వింటే వాటి మీద క్లారిటీ వచ్చినట్టే అనిపిస్తోంది. తనకు ఫైనల్ రష్ చూపించారని చెప్పిన చిరు ఒకవేళ తాను చెబితే రీ షూట్ చేయడానికైనా సుకుమార్ సిద్ధంగా ఉన్నాడని కాని తనకు ఏదీ చెప్పాలని అనిపించలేదని చెప్పడం చూస్తే సుక్కు మనసులో అవసరమైతే మళ్ళి తీద్దాం అన్న ఆలోచన ఉన్నట్టే కదా. కొన్ని నెలల క్రితమే రంగస్థలంలో కొంత భాగం సంతృప్తికరంగా రానందువల్ల రీ షూట్ చేయక తప్పలేదనే వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చాయి.

చరణ్ మాత్రం షూటింగ్ మొదలు పెట్టిన క్షణం నుంచి సుకుమార్ మీద అంతులేని నమ్మకాన్ని పెట్టుకున్నాడన్నది నిజం. నాన్న ఏవైనా మార్పులు చెప్పినా సుక్కు టేకింగ్ కి గౌరవమిచ్చి చిరునే రివర్స్ లో చరణ్ కన్విన్స్ చేసాడనే టాక్ కూడా గతంలోనే ఉంది. సుక్కును తాను ఎంత నమ్మాడో ఇద్దరు ఒకరికి ఒకరు ఎంత మిస్ అవుతున్నారో స్పీచుల్లో బయటపడిపోయింది. సో సుకుమార్ పర్ఫెక్షన్ కోసం ఎంత తపిస్తాడో దీని ద్వారా మరోసారి రుజువైనట్టే. గతంలో నాన్నకు ప్రేమతో విషయంలో కూడా సుక్కు ఇలాగే కాంప్రోమైజ్ కానందుకే కొంత ఆలస్యం జరిగిందని అప్పుడు కూడా టాక్ వచ్చింది. క్వాలిటీ కోసం నిర్మాతకు కాస్త భారం అనిపించినా రాజీ పడని మనస్తత్వం వల్లే సుకుమార్ సినిమాలు షూటింగులు ఎక్కువ కాలం జరుగుతాయి అన్న వాదనకు దీని వల్ల బలం చేకూరినట్టే. రంగస్థలం ఇప్పుడున్న హైప్ లో అంచనాలలో సగం నిలబెట్టుకున్నా సుకుమార్ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. ఒకవేళ దానికి మించి ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంటుంది. 
Tags:    

Similar News