ఒక సినిమా హిట్ .. బ్లాక్ బస్టర్ అయిందంటే కేవలం దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్ , నటీనటుల శ్రమే కాదు. దాని వెనక ఎంత మంది శ్రమ వుంటుందో చాలా మందికి తెలియదు. వందల మంది టీమ్ అంతా కలిసి సమిస్టిగా పని చేస్తే ఆ సినిమా విజయతీరాలు దాటుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్.ఉన్ నటించిన `పుష్ప` ఇదే తరహా సమిస్థి కృషివ వల్లే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి టాక్ ఆప్ ది ఇండియాగా మారింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ గా నటించి శభాష్ అనిపించుకున్నాడు.
సినిమా చూసిన వాళ్లకి వన్ మెన్ ఆర్మీగా ఒంటి చేత్తో సినిమాని నడిపించిన తీరు ఆకట్టుకుంది. అయితే ఈ విజయం వెనక వందల మంది శ్రామికుల అహర్నిశల శ్రమ వుందని, దాని వల్లే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించిందని దర్శకుడు సుకుమార్ ఈ మూవీ థ్యాంక్స్ మీట్ లో వెల్లడించడం ఆసక్తికరం. ఈ సందర్భంగా టీమ్ మెంబర్స్ కి రిటర్న్ గిఫ్ట్ లు ఇవ్వబోతున్నానని స్టేజ్ పైనే అనౌన్స్ చేశారు. `పుష్ప` దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం హైదరాబాద్‌లో థ్యంక్స్ మీట్ ని నిర్వహించింది.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడిస్తూ ఎమోషనల్ అయిన దర్శకుడు సుకుమార్ రచయిత చంద్రబోస్ కాళ్లకు నమస్కరించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తరువాత చిత్రానికి రేయింబవల్లు అనకుండా శ్రమించిన లైట్ బాయ్స్, సెట్ బాయ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సభ్యులకు ఈ సందర్భంగా వారి శ్రమని చూస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని పించిందిని, అందుకే ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున అందించాలని నిర్ణయించుకున్నానని సుకుమార్ వెల్లడించడంతో అక్కడున్న వారంతా హర్షాతిరేకాల్ని వ్యక్తం చేశారు.