రైటర్ కాళ్లపై సుక్కూ ఎందుకు పడ్డాడంటే

Update: 2017-01-03 09:30 GMT
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకడు. సుకుమార్ సినిమా టైటిల్ కార్డ్స్ లో ఉంటేనే.. థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య బోలెడు ఉంటుంది. అలాంటి సుకుమార్ ఓ రచయిత కాళ్లపై పడి అభివందనం చేశాడంటే అది చిన్న విషయం కాదు.

బాహుబలి రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం తనే రచయిత దర్శకుడిగా ఓ మూవీ చేస్తున్నాడు. శ్రీవల్లి టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ సందర్భంగా.. సుకుమార్ కూడా హాజరయ్యాడు. డైరెక్టర్ గా ఎంత గొప్ప పేరున్నా స్టోరీ చెప్పడంలో మాత్రం తాను చాలా వీక్ అని చెబుతుంటాడు సుకుమార్. 'నేను ఓ కథ చెప్పాలంటే 3-4 గంటలు కనీసం పడుతుంది. కానీ శ్రీవల్లి సినిమాకు రైటర్-డైరెక్టర్ అయిన విజయేంద్ర ప్రసాద్ కేవలం 22 నిమిషాల్లో మొత్తం కథను అద్భుతంగా వివరించారు. ఆ కథ అయ్యేసరికి నేను నాలోని భావాలను ఏ మాత్రం ఆపుకోలేక.. వెంటనే ఆయన కాళ్లపై పడిపోయాను' అని చెప్పాడు సుకుమార్.

అంత మంచి కథను 22 నిమిషాల్లో పూర్తి చేయగలగడం థ్రిల్ అనిపించిందట. అలాగే విజయేంద్ర ప్రసాద్ ను తన గురువుగా భావిస్తానని.. అందుకే ఆయనకు పాదాభివందనం చేశానన్నాడు సుకుమార్. ఇండస్ట్రీలో పాదనమస్కారాలు కామన్ గానే ఉంటాయ్ కానీ.. దాన్ని ఓ టాప్ డైరక్టర్ ఇలా ఓపెన్ గా చెప్పగలగడం చాలా పెద్ద విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News