ఫైరసీ మూవీని ప్రొడ్యూసర్​ కే పంపాడు..!

Update: 2021-04-05 06:30 GMT
సినీ నిర్మాతలకు ఫైరసీ బెడద కొత్తది కాదు. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఫైరసీ వీడియోలు మార్కెట్​ లో కి వస్తుంటాయి. దీంతో నిర్మాతలు చాలా నష్టపోతూ ఉంటారు. ఇటువంటి ఘటనలపై గతంలో నిర్మాతలు అనేక సార్లు ఫైట్​ చేశారు. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకున్నది. కానీ కొన్ని వెబ్​సైట్లు మాత్రం.. ఎప్పటికప్పుడు తమ ఐపీ అడ్రస్​ ను.. వెబ్​ అడ్రెస్​ ను మార్చుకుంటూ సినిమాలు ఫైరసీ చేసి సొమ్ము చేసుకుంటున్నాయి.

 తాజాగా ప్రముఖ తమిళ నటుడు కార్తీ, నటించిన సుల్తాన్​ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించారు. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళనాడులో హిట్​ టాక్​ తెచ్చుకున్నది. దీంతో సినిమా టీం థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమాను చూస్తూ.. మూవీని ప్రమోట్​ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫైరసీ అయ్యింది. టెలీగ్రామ్​ లో ఈ సినిమా చక్కర్లు కొడుతున్నది.

 ఇదిలా ఉంటే నేరుగా ఓ నెటిజన్​ సినిమా నిర్మాత ప్రభుకే ఈ మూవీ వీడియో లింక్​ను పంపించాడు. ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది.  దీంతో నిర్మాత ప్రభు  తీవ్రంగా ఫైర్​ అయ్యారు. వీడియోను ఫైరసీ చేయడమే కాక.. నాకే లింక్​ పంపిస్తారా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇప్పుడే కాదు గతంలోనూ అనేక చిత్రాలు ఫైరసీ అయ్యాయి. అయితే చాలా మంది ఫైరసీ వీడియోలు చూడటానికి పెద్దగా ఇష్టపడరు. అందుకు కారణం ఆ వీడియోల్లో క్లారిటీ ఉండదు. సౌండ్​ కూడా సరిగ్గా వినిపించదు. దీంతో మెజార్టీ ఆడియన్స్​ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్​ చేస్తుంటారు. అయినప్పటికీ ఫైరసీ వల్ల మూవీకి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. గతంలో ఫైరసీపై తెలుగులోనూ అనేక పోరాటాలు సాగాయి.

ప్రభుత్వం ఎన్నిక కఠిన నిబంధనలు తీసుకొచ్చినా.. సదరు వెబ్​సైట్లపై నిషేధం విధించినా.. ఫైరసీ ఆగడం లేదు. అప్పడప్పుడూ థియేటర్లో ఆడుతున్న సినిమాలు, అమేజాన్​, ఆహా, నెట్​ఫ్లిక్స్ వంటి ఓటీటీలో విడుదలైన చిత్రాలు సైతం ఫేస్​బుక్​లో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. సదరు సైట్లపై నిషేధం విధించినప్పటికీ పేర్లు మార్చుకొని ఆ సైట్లు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. దీంతో చాలా చిన్న సినిమాలు నష్టపోయాయి.
Tags:    

Similar News