ఇప్పటివరకు బాలీవుడ్ లో వచ్చిన 100 కోట్ల క్లబ్ సినిమాలు చూసుకుంటే.. అందులో ఎక్కువగా సల్మాన్ ఖాన్ సినిమాలే ఉన్నాయి. నవతరం బాలీవుడ్ కు నిజమైన సూపర్ స్టార్ అంటే మనోడే మరి. ఇక ''సుల్తాన్''తో కలుపుకుంటే.. ఆ లెక్క 10 సినిమాలకు చేరుకుంది. మొత్తానికి సల్మాన్ స్టార్డమ్ అంటే ఏంటో ఈసారి బాలీవుడ్ కూడా చాలా కొత్త యాంగిల్ లో చూస్తోంది.
సుల్తాన్ సినిమా బుధవారం రిలీజైనా కూడా.. ఆ రోజునే సినిమా ₹ 36.54 కోట్ల నెట్ వసూలు చేసింది. తరువాత గురువారం నాడు ₹ 37.20 కోట్ల కలక్షన్ తెచ్చింది. ఇక శుక్రవారం వసూళ్ళతో కలుపుకుంటే.. సినిమాకు 3 రోజుల్లో 100 కోట్ల నెట్ వసూళ్ళు వచ్చినట్లే. తొలిరోజునే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం.. పైగా సినిమాలో డల్ మూమెంట్స్ లేకుండా ఎక్కడ చూసినా కూడా ఎమోషనల్ గానో లేకపోతే యాక్షన్ ఎలిమెంట్స్ టైపులోనే డామినేషన్ ఉండటం.. సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సుల్తాన్ గా సల్మాన్ అదరగొడితే.. అరాఫా పాత్రలో అనుష్క శర్మ ఉతికేసింది. దానితో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేకుండా పోయింది.
యావరేజ్ టాక్ వచ్చిన బజరంగీ భాయిజాన్ సినిమాతోనే 500 కోట్ల గ్రాస్ వసూళ్ళు తెచ్చేస్తే.. ఇప్పుడు సల్మాన్ భాయ్ సుల్తాన్ సినిమాతో ఎలా కొడతాడో చూసుకోండి మరి.