యాంకర్ సుమ టైమింగ్ గురించి, స్పాంటేనియస్ టాకింగ్ స్టయిల్ గురించి ఎంతైనా చెప్పుకోవాల్సిందే. ఇప్పుడున్న సీనియర్ యాంకర్ లలో సుమ అంత స్పీడ్ లో ఉండడానికి కారణం ఈ ప్రత్యేక క్వాలిటీస్ అనే చెప్పాలి. నిన్నటిరోజున అఖిల్ ఆడియో వేడుకలో సుమ మెరుపులు మెరిపించింది. అహూతులకు బోర్ కొట్టకుండా తనదైన స్టయిల్ యాంకరింగ్ తో మెప్పించింది.
ఆడియో వేదికపై మధ్య మధ్యలో సెటైర్ లు - పంచ్ లు - జోకులు వేస్తూ అందరినీ నవ్వించింది. ఓసారి కొరటాల గారు బరువు తగ్గాను అంటూ పంచ్ వేసింది. అలాగే అప్పటికే సిగ్గుల మొగ్గ అయిపోతున్న అఖిల్ హీరోయిన్ సయేషా సైగల్ తో డ్యాన్సు వేయించేసింది. ఆ డ్యాన్సు బిట్ లో సయేషా స్టయిల్ కుర్రకారులో గుబులు పుట్టించింది. ఏం చేసినా అక్కినేని అభిమానులకు సుమ పిచ్చిగా నచ్చేసింది. ఫ్యాన్స్ కి ఏం కావాలో అది దక్కేలా చేసింది సుమ. అమ్మాయిల విషయంలో డాడ్ టిప్ప్ చెబుతున్నారా? అంటూ నాగ చైతన్యను కూడా ఇబ్బంది పెట్టింది. ఏ విషయంలో అయినా సలహా అఖిల్ నే అడుగుతా.. అన్నందుకు చైతూకి భలేగా ట్విస్టిచ్చింది సుమ. ఈ జనరేషన్ లో అఖిల్ తన్నుకుపోతున్నాడు, ఆ జనరేషన్ లో నాన్న చూసుకున్నాడు. మధ్యలో నేనే మజ్ను అయిపోయా.. అంటూ చైతూ కూడా సరైన టైమింగ్ తో మాట్లాడాడు. అక్కినేని వంశం అంటే అమ్మాయిల గుండెల్లో గుబులు అని చెప్పకనే చెప్పాడు.
ఓ వైపు కోయాంకర్ నస భరించలేని పరిస్థితుల్లో ఉన్న ఆడియెన్ కి బోర్ కొట్టకుండా మధ్యలో తనే కవర్ చేసేస్తూ.. తనే కొన్ని ప్రశ్నలు తెలివిగా అడిగి ఆ బోరింగ్ సిట్యుయేషన్ నుంచి జనాల్ని బైటపడేసే ప్రయత్నం చేసింది. ప్రముఖుల ప్రత్యేకతను బట్టి వేదికపైకి ఆహ్వానించే ముందు వారిని పరిచయం చేయాలన్న సెన్సిబిలిటీ సుమ ప్రదర్శించింది. ఇంత ఉంది కాబట్టే ఒక్కో ప్రోగ్రామ్ కి లక్ష పైగా అందుకుంటూ.. టాలీవుడ్ ను ఏలేస్తోంది మరి.