సుమ-కీరవాణి.. పేలిపోయింది

Update: 2015-11-02 06:59 GMT
సందేహమే లేదు. ప్రస్తుతం తెలుగులో ఉన్న నెంబర్ వన్ యాంకర్ సుమనే. ఆమె వాక్చాతుర్యం.. సెన్సాఫ్ హ్యూమర్.. టైమింగ్.. మరెవరికీ సాధ్యం కావు. చాలామంది సుమ స్టయిల్ ను కాపీ చేయాలని చూస్తారు.. చాలా సహజంగా, అలవోకగా యాంకరింగ్ చేసుకెళ్లిపోయే సుమకు వేరెవ్వరూ సాటి రారు. అందుకే టాలీవుడ్ లో ఏ పెద్ద ఆడియో ఫంక్షన్ జరిగినా.. అక్కడ సుమ యాంకరింగ్ చేసి తీరాల్సిందే. ‘సైజ్’ జీరో ఆడియో పంక్షన్ లోనూ యాంకరింగ్ ను తనదైన శైలిలో రక్తి కట్టించింది సుమ. ముఖ్యంగా కీరవాణి వేదిక మీదికి వచ్చినపుడు వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ భలే ఆసక్తి రేపింది.'

వేదిక మీదికి వచ్చిన కీరవాణితో వెయింగ్ మిషన్ మీద వెయిట్ చూయించాక.. ఆయన్నో ప్రశ్న అడిగింది సుమ. మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయి ఉంటే.. మీరు ఏమయ్యేవారు అని. దానికి కీరవాణి బదులిస్తూ.. ‘‘నాకు ఆస్ట్రాలజీ అంటే బాగా ఆసక్తి. ఆ సబ్జెక్ట్ సగం నేర్చుకున్నాను కూడా. సినిమాల్లోకి రాకపోయి ఉంటే మిగతా సగం కూడా నేర్చుకుని ఆస్ట్రాలజర్ అయ్యేవాడిని’’ అన్నారు. ఐతే  నా చేయి చూసి జాతకం చెప్పండని అడిగింది సుమ. దీంతో కీరవాణి ఆమె కుడి చేయి అందుకుని, రేఖలు చూస్తూ.. ‘‘ధన రేఖ బాగా ఉంది. మీరు త్వరలోనే గచ్చిబౌలిలో ఐదెకరాలు మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారు’’ అన్నారు. మళ్లీ ఎడమ చేయి అందుకుని.. ‘‘ఐదేళ్ల తర్వాత అమరావతిలో ఓ 15 ఎకరాలు కొని, ఫ్లాట్లు వేస్తారు’’ అని చమత్కారం డబుల్ చేశాడు. దానికి సుమ.. ‘‘ఆస్ట్రాలజీలో జియోగ్రాఫికల్ లైన్స్ కూడా ఉంటాయా. గచ్చిబౌలి, అమరావతి అని కూడా చూపిస్తారా? ఐతే కేరళలో ఏమైనా కొంటానని లేదా’’ అంటూ నవ్వులు పూయించింది.
Tags:    

Similar News