సుమ‌క్క ఎందుకిలా షాకిస్తోంది!

Update: 2022-12-27 13:30 GMT
బుల్లితెర‌, స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఏదైనా సుమ వుండాల్సిందే. స్వ‌త‌హాగా మ‌ల‌యాళీ అయినా తెలుగింటి కోడ‌లు కావ‌డం.. త‌న‌కు తెలుగుపై వున్న అభిమానంతో తెలుగు చ‌క్క‌గా నేర్చుకుని గ‌త 15 ఏళ్లుగా వివిధ ఛాన‌ల్స్ లో యాంక‌ర్ గా రాణిస్తూ త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు యాంక‌ర్ సుమ‌. న‌టి కావాల‌నుకుని యాంక‌ర్ గా మారిన సుమకు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులున్నారు. యాంక‌ర్ ల‌లో స్టార్ యాంక‌ర్ గా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న సుమ ఓ స్టార్ యాంక‌ర్‌.

అలాంటి సుమ స‌డ‌న్ గా అభిమానులు షాకిస్తోంది. గ‌త కొంవ‌త కాలంగా ప‌లు టీవీ షోల‌కు వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న‌దైన పంచ్ ల‌తో ఆ షోల‌కే వ‌న్నె తెచ్చిన సుమ యాంక‌రింగ్ కి విరామం ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించి షాకిచ్చింది. ఓ టీవీషోలో పాల్గొర‌న్న సుమ త‌ను యాంక‌రింగ్ కు బ్రేక్ ఇస్తున్నాన‌ని వెల్ల‌డించి బావోద్వేగానికి లోనైంది. ఈ సంద‌ర్భంగా ఎమోష‌న్ కు గురైన సుమ స్టేజ్ పైనే క‌న్నీళ్లు పెట్టుకుంది. నేను మ‌ల‌యాళీ అయినా తెలుగు ప్రేక్ష‌కులు న‌న్ను గుండెల్లో పెట్టుకుని ప్రేమించార‌ని తెలిపింది.

యాంక‌ర్ గా త‌న 15 ఏళ్ల ప్ర‌యాణానికి సుమ ఉన్న‌ట్టుండి బ్రేక్ ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డంతో స్టేజ్ పై వున్న వారంతా సుమ‌ని శాలువాతో స‌త్క‌రించి స‌న్మానం చేశారు. ఇందుకు సంబంధించిన ప‌లు ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. సుమ దాదాపు కొన్నేళ్ల విరామం త‌రువాత `జ‌య‌మ్మ పంచాయితీ` సినిమాతో మ‌రోసారి వెండితెర‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. కానీ ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది.

ఈ సినిమా ఫ‌లితంతో ఇక‌పై సినిమాల‌లో న‌టించ‌న‌ని స్టేట్‌మెంట్ ఇచ్చేసి షాకిచ్చింది. ఇదిలా వుంటే ఉన్న‌ట్టుండి సుమ‌క్క యాంక‌ర్ గా బ్రేక్ ఎందుకు తీసుకోవాల‌నుకుంటోంది?.. దీని వెన‌కున్న అస‌లు కార‌ణ‌మేంటీ?.. సుమ‌క్క ఎందుకు ఎమమోష‌న‌ల్ అయింద‌న్న‌ది ఇప్ప‌డు ఆమె అభిమానుల్లో ఆస‌క్తిక‌ర‌ర చ‌ర్చ‌గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News