పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాననేవారు

Update: 2020-01-22 01:30 GMT
1980లలో టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా చిరంజీవి.. బాలకృష్ణ వంటి వారికి గట్టి పోటీ ఇచ్చిన హీరో సుమన్‌. కొన్ని అనూహ్య కారణాల వల్ల సుమన్‌ కెరీర్‌ అర్థాంతరంగా డౌన్‌ ఫాల్‌ మొదలయ్యింది. మద్యలో సినిమాలకు దూరంగా ఉన్నా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. విలన్‌ గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమన్‌ తాజాగా అలీతో సరదాగా టాక్‌ షోలో పాల్గొన్నాడు.

వచ్చే వారంలో ప్రసారం కాబోతున్న ఈ టాక్‌ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. సుమన్‌ నుండి పలు ఆసక్తికర విషయాలను సుమన్‌ రాబట్టినట్లుగా ప్రోమోతోనే అర్థం అవుతుంది. ముఖ్యంగా సుమన్‌ కు హీరోగా ఉన్న సమయంలో వచ్చిన ప్రేమ లేఖల గురించి అలీ ప్రస్థావించాడు. రక్తంతో లేఖలు రాసి మరీ అప్పట్లో సినిమా సెట్స్‌ కు వచ్చి మరీ ఇచ్చే వారంటూ పాత జ్ఞాపకాలను సుమన్‌ గుర్తు చేసుకున్నారు.

రైళ్లలో చెన్నై వచ్చి రక్తపు లేఖలను చేతిలో పెట్టి పెళ్లి అంటూ చేసుకుంటే మిమ్మలనే అంటూ చాలా మంది అన్నారు. అప్పట్లో ఫోన్‌ లు లేకపోవడంతో డైరెక్ట్‌ గానే మెసేజ్‌ లు ఇచ్చే వారంటూ సుమన్‌ అన్నాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో మీరు పెళ్లంటూ చేసుకుంటే తెలుగు అమ్మాయినే చేసుకుంటాను అంటూ మాట ఇచ్చారట ఎందుకు అంటూ అలీ ప్రశ్నించగా.. ఔను నేను అన్నట్లుగానే తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్నాడు సుమన్‌. ఇంకా పూర్తి ఇంటర్వ్యూలో ఎనెన్ని విషయాలను సుమన్‌ తో అలీ చెప్పించాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Tags:    

Similar News