ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి బాలకృష్ణతో పాటు అందరి గెటప్ లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేపుతున్నాయి. దానికి కారణం ప్రతి ఒక్కరు ఆయా పాత్రలకు తగ్గట్టు పరకాయ ప్రవేశం చేయటమే కాదు అందులో అచ్చంగా ఒదిగిపోవడమే దీనికి కారణం. నారా చంద్రబాబు నాయుడుగా రానా లుక్ చూసి షాక్ తినని వారు లేరు. అలాగే అక్కినేని నాగేశ్వర్ రావు గారిలా నటిస్తున్న సుమంత్ అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసేలా కనిపిస్తున్నాడు. గతంలో వదిలిన పోస్టర్స్ లోనే అచ్చం తాతగారిలాగే ఉన్నాడే అనే కాంప్లిమెంట్స్ అందుకున్న సుమంత్ ఇప్పుడు వచ్చిన మరో లీక్ స్టిల్ ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఆన్ లొకేషన్ లో తెల్లని దుస్తులు వేసుకుని తల మీద టోపీతో ఠీవిగా చేతి కాలరును సర్దుకుంటూ వస్తుంటే అక్కడ ఉన్న వారు ఏఎన్అరే అంటూ కామెంట్ చేసారని సమాచారం. మొత్తానికి సుమంత్ బాలయ్యకు ధీటుగానే ఉన్నాడని అర్థమైపోతుంది.
ఏఎన్నార్ పాత్ర అధికశాతం కథానాయకుడు పార్ట్ లోనే ఉండబోతోందని వినికిడి. మహానాయకుడు రాజకీయ జీవితంతో ముడిపడిన కథ కాబట్టి అందులో అక్కినేని ప్రమేయం పెద్దగా ఉండదు. పైగా పార్టీలోకి రమ్మని ఎన్టీఆర్ ఆహ్వానించినప్పుడు ఏఎన్నార్ సున్నితంగా తిరస్కరించారు. ఆ ఒక్క సీన్ ఉండొచ్చేమో కానీ జనవరి 24న వచ్చే ప్రజా నాయకుడిలో మాత్రం అంతకు మించి సన్నివేశాలు ఉండే అవకాశం అయితే లేదు.
పెద్ద స్థాయిలో ఉన్న ఇద్దరు అగ్ర హీరోలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పధ్నాలుగు మల్టీ స్టారర్స్ లో నటించడం ఇప్పటికీ ఒక రికార్డే. సినిమాకు మించిన సాన్నిహిత్యం వాళ్ళ మధ్య ఉండేది. అందుకే క్రిష్ ఈ పాత్ర చాలా శ్రద్ధతో రూపొందించాడట. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ హల్చల్ చూస్తుంటే ఒకవేళ అక్కినేని కథను సినిమాగా తీయాలంటే ఛాయస్ కోసం వెతికే అవసరం లేకుండా చేస్తున్నాడు.