నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి కీలక పాత్రల ఫస్ట్ లుక్స్ ఒక్కొకటిగా బయటికి వస్తున్నాయి. ఇటీవలే నారా చంద్రబాబు నాయుడుగా రానాను చూసి అందరు షాక్ తినగా తాజాగా సుమంత్ అక్కినేని నాగేశ్వర్ రావు గారిలా పరకాయ ప్రవేశం చేసి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఇవాళ ఏఎన్నార్ జయంతి సందర్భంగా విడుదల చేసిన లుక్ లో సుమంత్ ను చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మహానటిలో నాగ చైతన్య తాతయ్యలా కనిపించేందుకు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ దానికి అంతగా నప్పలేదనే కామెంట్స్ చాలా వినిపించాయి. వయసు దృష్ట్యా అంత బరువును చైతు మోయలేక జస్ట్ యావరేజ్ అనిపించాడు. కానీ సుమంత్ లో అక్కినేని గారి పోలికలు ఉన్నాయని ముందు నుంచి అందరు అనుకున్న మాటే. క్రిష్ అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సుమంత్ ను రంగంలో దింపి తనకు రావాల్సిన అవుట్ ఫుట్ తెచ్చేసుకున్నాడు.
ఎన్టీఆర్ జీవితంలో నాగేశ్వరావు గారి పాత్ర చాలా ఉంది. సహనటుడిగా కంటే మంచి స్నేహితులుగా ఇద్దరు సఖ్యతతో ఉండేవారు. అందువల్లే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సినిమాల్లో కలిసి నటించి మల్టీ స్టారర్స్ విషయంలో ఎప్పటికీ చెరిగిపోలేని రికార్డు సృష్టించారు. కాబట్టి ఇప్పుడీ బయోపిక్ లో సుమంత్ కు బాలయ్య కు మధ్య చెప్పుకోదగ్గ స్థాయిలో మంచి ఎమోషనల్ సీన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సుమంత్ కూడా మీసాలు లేకుండా అచ్చం అక్కినేని రూపాన్ని కళ్ళముందుకు తీసుకురావడంలో బెటర్ ఆప్షన్ అనిపించేలా అందులో ఒదిగిపోయాడు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసినప్పుడు పార్టీలోకి రమ్మనే ఆహ్వానాన్ని ఎఎన్ ఆర్ తిరస్కరించినా ఆ తర్వాత కూడా ఇద్దరు స్నేహితులుగానే కొనసాగారు. కానీ తనకు సరిపడని రాజకీయాల జోలికి ఏఎన్నార్ వెళ్లని కారణంగా టిడిపి పార్టీ స్థాపించాక ఇద్దరూ నేరుగా కలిసే అవకాశాలు తగ్గిపోయాయి. ఈ విశేషాలతో పాటు ఎన్టీఆర్ ఏఎన్నార్ ల కలయికలో ఎలాంటి సీన్స్ ఉంటాయో అని అని అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానులు.