సక్సెస్ తో సమ్మర్ క్లోజ్ చేసింది

Update: 2016-06-05 04:36 GMT
ఈ సమ్మర్ స్టార్ట్ కావడానికి ముందు అందరి దృష్టీ సమంత పైనా. ఈ ఒక్క సీజన్ లోనే సమంత నటించిన 4 భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ కు క్యూ కట్టడమే అందుకు కారణం. తెరి, 24, బ్రహ్మోత్సవం, అ..ఆ.. ఈ నాలుగు సినిమాల రిలీజ్ తర్వాత సమంతను పట్టుకోవడం ఇక సాధ్యం కాదేమో అనుకున్నారంతా. ఆ మూవీస్ పై అంతగా అంచనాలు ఏర్పడ్డాయి.

విజయ్ మూవీ తెరి తమిళ్ లో కమర్షియల్ సక్సెస్.. తెలుగులో పోలీసోడుగా ఫెయిల్యూర్. ఈ చిత్రం సమంతకు ఉపయోగపడలేదు. ఆ తర్వాత ద్విభాషా చిత్రంతో సూర్యతో నటించిన 24 వచ్చింది. సినిమాకు ప్రశంసలు వచ్చినా.. సమంత కనిపించిన తీరుపై మాత్రం బోలెడన్ని విమర్శలు వచ్చాయి. శామ్స్ లో బ్యూటీ తగ్గిపోయిందనే కామెంట్స్  వినిపించాయి. ఆ తర్వాత బ్రహ్మోత్సవంలో మహేష్ తో కలిసి జర్నీ చేసే రోల్ చేసింది సమంత. విడుదల తర్వాత బ్రహ్మోత్సవం గురించి మాట్లాడేందుకు సమంత కూడా ఇష్టపడలేదంటే.. పరిస్థితి అర్ధమవుతుంది. ఇక లాస్ట్ హోప్ గా వచ్చిన అ..ఆ.. మాత్రం సమంత కోరికను తీర్చింది.

అ..ఆ..కు సమంతనే మెయిన్ అట్రాక్షన్. యాక్టింగ్ పరంగా చాలా మెచ్యూర్ అయింది. ఇప్పటివరకూ తను చూపించని కొత్త భావాలను మొహంలో పలికించింది. పెర్ఫామెన్స్ లో మెరుగుపడింది. అన్నిటికీ మంచి విమర్శకులను మెప్పించి మరీ కమర్షియల్ సక్సెస్ సాధించింది. జనాలను థియేటర్లకు రప్పించింది. అలా నాలుగింటిపై ఆశలతో మొదలుపెట్టి.. మూడు నిరుత్సాహ పరిచినా.. చివరకు సమ్మర్ ను సక్సెస్ తో క్లోజ్ చేసింది సమంత.
Tags:    

Similar News