టాలీవుద్ దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి సాధించిన ఘనవిజయం.. ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తోంది. వందల కోట్ల బడ్జెట్ ను తిరిగి రాబట్టడం అంత కష్టమేం కాదని.. కథలో కంటెంట్ లో దమ్ముంటే ఎంత పెట్టుబడిని అయినా తిరిగి రాబట్టచ్చని జక్కన్న ప్రూవ్ చేశాడు. దీంతో బడా దర్శకులు కూడా భారీ బడ్జెట్లతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే శంకర్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా రోబో సీక్వెల్ 2.0 చిత్రాన్ని 4వందల కోట్లతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే స్థాయి బడ్జెట్ తో మరో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు దర్శకుడు సుందర్ సి ప్రకటించాడు. తేనాండాల్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీలో జయం రవి.. ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. గతంలోనే భారీ మూవీ తీస్తానని సుందర్ సి చెప్పినా.. అప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.
సూర్య హీరోగా ఈ మూవీ ఉంటుందని ఆశించారు కానీ.. జయం రవి-ఆర్యలను లీడ్ రోల్స్ లోకి తీసుకున్నారు. బాహుబలి స్థాయిలో ఈ చిత్రం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. 11 దేశాల్లో ఈ మూవీ చిత్రీకరించనున్నారట. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంఘమిత్రకు మ్యూజిక్ అందిస్తుండడం విశేషం. ఏమైనా ఇన్నేసి వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలకు ధైర్యం ఇచ్చినది మాత్రం జక్కన్నే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/