కింగ్ తో కుర్రాళ్లు పోటీ పడగలరా?

Update: 2016-03-15 03:58 GMT
సోగ్గాడే చిన్ని నాయన తర్వాత అక్కినేని నాగార్జున బాక్సాఫీస్ కింగ్ అయిపోయాడు. నాగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో.. తర్వాత సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. మరో పది రోజుల్లో మార్చ్ 25న నాగార్జున లేటెస్ట్ మూవీ ఊపిరి రిలీజ్ కానుంది. గుడ్ ఫ్రైడ్ కూడా కావడంతో.. ఈ సారి కూడా నాగార్జున కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తాడనే అంచనాలున్నాయి.

మార్చ్ 25న నాగార్జున సోలోగా రావడం లేదు. మల్టీ స్టారర్ మూవీ ఊపిరికి పోటీగా కుర్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సందీప్ కిషన్ మూవీ రన్ - నారా రోహిత్ సినిమా సావిత్రిలు కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండింటి మీద ఇండస్ట్రీలో అంచనాలు బాగానే ఉన్నా.. ఊపిరి అంత రేంజ్ లో అయితే మాత్రం కాదు. పైగా ఊపిరికి స్టార్ కాస్టింగ్ ఎక్కువ. నాగ్ తో పాటు కార్తీ - తమన్నాలు కూడా ఉన్నారు. పైగా ఇది తెలుగు - తమిళ్ రెండు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా. 60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఊపిరికి.. భారీ ఎత్తున ప్రచారం చేయనున్నారు నిర్మాత పీవీపీ.

మరి ఈ సంగతులన్నీ సందీప్ కిషన్ - నారా రోహిత్ లకు బాగానే తెలుసు. అయితే సంక్రాంతికి ఒకేసారి నాలుగు సినిమాలు వచ్చి హిట్ కొట్టిన విషయాన్ని వీరు గుర్తు చేసుకుంటున్నారు. పైగా ఈ సినిమాలేవీ అప్పటి లాగా వేల కొద్దీ థియేటర్స్ కోసం ట్రై చేసేవి కాకపోవడంతో.. కంటెంట్ బాగుంటే రిజల్ట్ బాగానే ఉండొచ్చు. తన కెరీర్ లోనే బెస్ట్ స్టేజ్ లో ఉన్న నాగార్జునతో.. కుర్రాళ్లు ఏ మాత్రం పోటీ పడగలరో చూడాలి.
Tags:    

Similar News