రెడ్డి గారి మర్డర్లలో హీరో ఎవరో!!

Update: 2018-01-02 23:30 GMT
ఈ కాలం దర్శకులు సినిమాలను చాలా లేట్ గా  తెరకెక్కిస్తున్నారనే చెప్పాలి. మొదటి సినిమా హిట్ అయితే చాలు ఏడాది కావస్తున్నా ఇంకా నెక్స్ట్ ఎలాంటి కథను తెరకెక్కించాలి అనే విషయంపై ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. ఒకవేళ కథ రెడీగా ఉన్నా మొదటి సినిమా హిట్ అయ్యింది కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయనే ఉద్దేశంతో కథలను మళ్లీ రిపేర్ చేయడానికి టైమ్ తీసుకుంటున్నారు.

అంతే కాకుండా సెకండ్ సినిమా స్టార్ హీరోతో చేయాల్సి వచ్చినా కొన్ని మార్పులు చెయ్యక తప్పదు. దీంతో ఏ విధంగా ఆలోచించినా ఒక ఆరు నెలల వరకు నేటి తరం హిట్టు దర్శకుల సెకండ్ స్టెప్ పడటం లేదు. ఇక అసలు విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డి దర్శకుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ మొదటి సినిమా ఏ స్థాయిలో రికార్డ్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమా తరువాత స్టార్ హీరోలతో ఛాన్స్ దక్కించుకున్నాడని అనేక రూమర్స్ వచ్చాయి. అంతే కాకుండా చర్చలు కూడా జరుగుతున్నాయని టాక్ వచ్చింది.

ఇక అవి ఎంతవరకు నిజమో తెలియదు గాని సందీవ్ నెక్స్ట్ సినిమా మాత్రం ఒక క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. మొన్నటి వరకు ఒక సీరియల్ కిల్లర్ అని టాక్ వచ్చింది. ఏదైనా కూడా.. రోమాలు నిక్కపొడిచే క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు సన్నిహితులు. కొన్ని మర్డర్లు.. అవి చేసినోడ్ని కనిపెట్టడం కథట. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యిందట. కానీ ఇంకా హీరో ఎవరు అనేది సస్పెన్స్ లో ఉంది. ఒక ముగ్గురి హీరోలను దర్శకుడు కలవాలని అనుకుంటున్నాడట. వారిలో ఎవరు సెట్ అయినా మరికొన్ని రోజుల్లో అఫీషియల్ గా సందీప్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాడని టాక్. మరి రెడ్డిగారి మర్డర్లలో హీరో ఎవరో?
Tags:    

Similar News