క్రిటిక్స్ రివ్యూలు ఎలా ఉన్నా కూడా ఆడియన్స్ నా సినిమాలను చూస్తున్నారు అంటున్నాడు సునీల్. అయితే ఈ గోల్డెన్ స్టార్ చెప్పినట్లు నిజంగానే మనోడు సినిమాను ఆడియన్స్ అదే రేంజులో ఆదరించారు. ఎందుకంటే ''కృష్ణాష్టమి'' తొలిరోజు కలక్షన్లే ఇందుకు ఎగ్జాంపుల్. పైగా ఏ ఒక్క యంగ్ హీరో కూడా ఎచీవ్ చేయని ఫీట్ ను సునీల్ ఎచీవ్ చేశాడు.
కేవలం తెలుగు రాష్ట్రంలలో చూసుకుంటే.. ''కృష్ణాష్టమి'' సినిమా 2.5+ కోట్లు షేర్ వసూలు చేసింది. ఇదే ఈ మధ్య కాలంలో విడుదలైన యంగ్ సెన్సేషన్ రాజ్ తరుణ్ ''కుమారి 21ఎఫ్'' సినిమా మొదటి రోజు కలక్షన్ చూసుకుంటే.. తెలుగు రాష్ట్రంలలో 1.71 కోట్లు మాత్రమే వచ్చింది. సుకుమార్ దేవిశ్రీ వంటి పెద్ద పేర్లు ఎటాచ్ అయ్యున్నప్పటికీ.. హిట్ టాక్ వచ్చినప్పటికీ.. తొలిరోజు అంతే వచ్చింది. ఇకపోతే న్యాచురల్ స్టార్ నాని ''కృష్ణగాడి వీర ప్రేమ గాధ'' అంటూ వస్తే.. తొలిరోజు ఎపి అండ్ తెలంగాణలో 1.6 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. భలే భలే మగాడివోయ్ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రంలలో 1.75 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేశాడు నాని. ఆ లెక్కన చూసుకుంటే.. రాజ్ తరుణ్.. నాని.. కంటే సునీల్ ''ఓపెనింగ్స్'' విషయంలో పెద్ద స్టారే మరి.
ఇకపోతే సోమవారం నాడు.. తొలివీకెండ్ కలక్షన్లను చూస్తే.. కృష్ణాష్టమి సినిమా ఫైనల్ పొజిషన్ ఏంటో చెప్పొచ్చు.