కమెడియన్ గా స్టార్ డంను దక్కించుకున్న సునీల్ హీరోగా అవకాశాలు రావడంతో కామెడీ పాత్రలు పూర్తిగా మానేసి హీరోగా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నించాడు. కాని కొన్నాళ్లకే సునీల్ హీరోగా ఫ్లాప్ లు చవి చూస్తూ వచ్చాడు. వరుసగా ఫ్లాప్ లు రావడంతో సునీల్ మళ్లీ కమెడియన్ గా చేయాలని నిర్ణయించుకున్నాడు. కమెడియన్ గా సునీల్ కు మునుపటితో పోల్చితే ఆఫర్లు చాలా తగ్గాయి. వచ్చిన చిన్నా చితకా ఆఫర్లు కూడా ఆయనలోని పూర్తి స్థాయి కమెడియన్ ను చూపించలేక పోయాయి. తాజాగా ఈయన 'చిత్రలహరి' చిత్రంలో నటించాడు. సాయి ధరమ్ తేజ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో రూపొందిన చిత్రలహరి టీజర్ తాజాగా వచ్చింది.
టీజర్ లో షాట్స్ చూస్తుంటే సునీల్ ఈసారి తన సత్తా చాటుతాడేమో అనిపిస్తుంది. టీజర్ లోనే సునీల్ కు ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమల సినిమాలో కూడా మంచి పాత్రను ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. కథకు నాలుగు పాత్రలు కీలకం అని, అందులో ఒక పాత్ర సునీల్ చేశాడని టీజర్ లో చూపించారు. కాస్త అమాయకత్వం కూడిన పాత్ర అని కూడా అనిపిస్తుంది. సునీల్ లో కమెడియన్ ఈసినిమాతో అయినా బయటకు వస్తాడని సినీ జనాలు ఆశిస్తున్నారు.
ఈ సినిమాలో కూడా మూస తరహాగానే సునీల్ కనిపిస్తే మాత్రం ఆయన కెరీర్ మెల్ల మెల్లగా డౌన్ ఫాల్ అవుతున్నట్లుగా భావించవచ్చు. స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా మళ్లీ సునీల్ బిజీ అవ్వాలంటే 'చిత్రలహరి'తో పాటు మరో రెండు మూడు చిన్న సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటు, కమెడియన్ గా సునీల్ ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలి. మరి సునీల్ అలా ఈ చిత్రంతో అనిపించుకుంటాడేమో చూడాలి.