హీరో అనేవాడు.. నచ్చిన సబ్జెక్టును చేసుకుంటూ పోతున్నా అని కాకుండా..తనపై ఒక నిర్మాత ఎంత పెడితే ఎంత వస్తుంది.. తొలిరోజు తన సినిమా ఎంత వసూలు చేస్తే పంపిణీదారులు ఎంత త్వరగా సేఫ్ జోన్ లోకి చేరుకుంటారు వంటి విషయాలపై దృష్టిపెట్టాల్సిందే. కలక్షన్లను నేను పట్టించుకోనండీ అని ఎవరైనా చెప్పారంటే అది ఖచ్చితంగా అబద్దం చెబుతున్నట్లే.
ఇప్పుడు ట్రేడ్ పండితులు అందరూ 'జక్కన్న' సునీల్ గురించే మాట్లాడుతున్నారు. మనోడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టలేడు కాని.. ఖచ్చితంగా మొదటిరోజు వసూళ్లతో ఒక కొత్త పాయింట్ ప్రూవ్ చేశాడు. యూత్ లో ఎంతో క్రేజు ఉన్న మరో హీరో నాని.. మొన్న 'జెంటిల్మన్' సినిమాకు ఓపెనింగ్ రోజున 3.16+ కోట్ల షేర్ పట్టుకొచ్చాడు. అయితే సునీల్ జక్కన్న మాత్రం ఏకంగా 3.7+ కోట్లు తెచ్చింది. ఉదయం ఆట అయిపోగానే యావరేజ్ టాక్ వచ్చినా కూడా అంతేసి కలక్షన్ వచ్చిందంటే.. అసలు మాస్ సెంటర్లలో సునీల్ పవరేంటో మనం రాసిపెట్టుకోవచ్చు. ఈ ఉదంతం చూసి సునీల్ ఏం తెలుసుకోవాలి మరి?
ఖచ్చితంగా తన సినిమాలో కామెడీ ఉండాలి కాని.. అది రొటీన్ స్ర్కాప్ కామెడీ కాకూడదు. అలాగే మిగిలిన ఎమోషన్లను కూడా కాస్త బాగా టచ్ చేసి వదిలితే.. వీజీగా సునీల్ బాబు ఒక 25 కోట్ల రేంజు హీరో అయిపోతాడు. ఏమయ్యా కామెడీ కుమారా.. కాస్త కష్టపడితే ఆ పొజిషన్ ఏదో ఇట్టే వచ్చేస్తుంది. మాంచి కథలను ఎన్నుకోవడంలో కాస్త కష్టపడవయ్యా!!