ఏంటీ.. సునీల్ కీ యాంటీ ఫ్యాన్సా?

Update: 2016-02-23 13:30 GMT
స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఎలా ఉంటారో.. యాంటీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేసేందుకు వీరు పడే ఉత్సాహం మామూలుగా ఉండదు. పెద్ద స్టార్లు కొట్టే హిట్లు చూసి, ఇతర హీరోల అబిమానులు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ సునీల్ కి కూడా యాంటీ ఫ్యాన్స్ తయారైపోవడం ఆశ్చర్యకరమే. కొన్నేళ్ల క్రితం వరకు సునీల్ కేవలం ఓ కమెడియన్ మాత్రమే.

ఇప్పుడు స్టార్ హీరోకి ఏ మాత్రం తగ్గను అనే రేంజ్ లో తయారైపోయాడు. సిక్స్ ప్యాక్ లు - ఫీట్లు - ఫైట్లు - డ్యాన్సులతో కుమ్మేస్తున్నాడు. సునీల్ బొమ్మ ఉంటే థియేటర్లకు వచ్చే ఆడియన్స్ కూడా ఎక్కువగానే ఉంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన కృష్ణాష్టమి చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చిన.. ఫస్ట్ వీకెండ్ లో నిలకడగా కలెక్షన్లు సాధించి.. ఆరు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాకి ఇది చాలా పెద్ద మొత్తం. అలాగే ఇప్పటికీ కలెక్షన్లు నిలబడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక సునీల్ గత మూవీ భీమవరం బుల్లోడికి కూడా నెగిటివ్ రివ్యూలు వచ్చినా, ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా నష్టపోలేదు. అందరికీ లాభాలు ఇచ్చిన సినిమా ఇది.

ఈ పరిస్థితి చాలామంది హీరోలకు, వారి అభిమానులకు మింగుడు పడ్డంలేదు. సునీల్ సాధించిన మాత్రం వసూళ్లు రాబట్టడంలో విఫలమవుతున్న ఎంతో మంది హీరోలు మన ఇండస్ట్రీలో ఉండడంతో.. వారి అభిమానులంతా ఇప్పుడు సునీల్ కి యాంటీ అయిపోతున్నారు.
Tags:    

Similar News