సూపర్ స్టార్ రజనీకాంత్ `దర్బార్` లో క్రూరుడైన విలన్ గా నటించాడు సునీల్ శెట్టి. నిజానికి ఈ పాత్రలో అతడి నటన కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ కంటే అద్భుతంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆరంగేట్రమే విలనీని మరో లెవల్లో ఆవిష్కరించిన సునీల్ శెట్టి ఆ తర్వాతా తెలుగు-తమిళంలో అవకాశాల్ని అందుకుంటున్నాడని టాక్ వినిపించింది.
ఇంతలోనే సునీల్ శెట్టి తన OTT అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. `ధారవి బ్యాంక్` అనేది సిరీస్ టైటిల్. శెట్టితో పాటు వివేక్ ఒబెరాయ్ - సోనాలి కులకర్ణి కూడా ఈ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ధారవి బ్యాంక్ అనేది ఒక ప్రత్యేకమైన రివెంజ్ క్రైమ్ డ్రామా సిరీస్. ఇది చివరి వరకు ఉత్కంఠగా సాగుతుంది.
MX ప్లేయర్ లో పాత్ బ్రేకింగ్ వెబ్ సిరీస్ అవుతుందని టీమ్ ఆశిస్తోంది. ఈ భూమిపై అత్యంత సంక్లిష్టమైన అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతమైన ధారావిలో ప్రమాదకరమైన.. చమత్కారమైన కథనంతో తెరకెక్కింది. సమిత్ కక్కడ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ లను చూస్తారని చెబుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ధారవిలోని వివిధ ప్రదేశాలలో ఈ సిరీస్ ను విస్తృతంగా చిత్రీకరించారు.
``సిరీస్ ఆద్యంతం ప్రామాణికతతో రూపొందించడానికి మేమంతా చాలా కష్టపడ్డాము. కథానుసారం అవసరమయ్యే వాతావరణం కుదిరింది. ఈ కథకు జీవం పోయడానికి ఇంత అంకితభావంతో కూడిన తారాగణం సిబ్బందిని పొందడం అదృష్టం`` అని దర్శకనిర్మాతలు అన్నారు.
ఆ సీన్ మరువలేం..!
ధారావి బ్యాంక్ అనగానే మహేష్ నటించిన `బిజినెస్ మేన్` చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశం గుర్తుకు వస్తుంది. కోట్లాది రూపాయల ధారావి ప్రజల అప్పును తాను తీర్చేస్తానని సూపర్ స్టార్ మహేష్ శపథం చేస్తాడు. అతడు చెప్పే డైలాగ్ ఇప్పటికీ చెవుల్లో రింగ్ మంటుంది. పూరి ఆ డైలాగ్ ని అంతే పవర్ ఫుల్ గా రాసాడు. ముంబైని ఏల్తానని వచ్చిన ఒక నిరుద్యోగి ఏకంగా ప్రజలందరి బ్యాంక్ అప్పు తీర్చేస్తానని ప్రగల్బాలు పలికితే సాధారణ ఉద్యోగి అయిన బ్రహ్మాజీ నివ్వెరపోతాడు ఆ సన్నివేశంలో. ఆ తర్వాత మూవీ స్క్రీన్ ప్లే గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు బిజినెస్ మేన్ లోని ఒక సన్నివేశంలో చూసిన అదే ధారావి బ్యాంక్ కథతో ఏకంగా సిరీస్ ని రూపొందించడం ఆసక్తికరం.