సక్సెస్ కోసం రీమేక్ అంటున్నాడే

Update: 2017-09-10 06:54 GMT
టాలీవుడ్ లో ఒకప్పుడు తన కామెడీతో పంచులతో ప్రేక్షకులని అలరించిన సునీల్ ప్రస్తుతం హీరోగా ఎదగడానికి చాలా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా హిట్ కొట్టాలని చేసిన ప్రతి సినిమాకి హార్డ్ వర్క్ చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. కానీ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని "ఉంగరాల రాంబాబు" అనే సినిమాతో రాబోతున్నాడు.

ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేయనుంది. ఓనమాలు - మళ్లీ మళ్లీ ఇది రానిరోజు వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ ఉంగరాల రాంబాబు ను తెరకెక్కించాడు. అయితే సునీల్ ఈ సినిమా రిలీజ్ కాకముందే మరొక సినిమాను లైన్ లో పెట్టేశాడు. 2014లో తమిళ్ లో రిలీజ్ ఆయిన సతురంగా వెట్టయ్ అనే సినిమాను తెలుగులో  రీమేక్ చేయడానికి రెడీ అయిపోయాడు.

ఆ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో చాలా మంది ఆ సినిమాపై మనస్సు పరేసుకున్నారు గాని ఎవరు రీమేక్ చేయలేకపోయారు. పూరి జగన్నాథ్ అందించిన రోమియో కథకు దర్శకత్వం వహించిన గోపి గణేష్‌ అనే యువ దర్శకుడు ఆ కథను తెరక్కేకించబోతున్నాడట. ఇక నిర్మాతగా నాని-జెంటిలిమెన్ వంటి హిట్ సినిమాను నిర్మించిన రమేష్ పిళ్ళై ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం అంత పెద్దగా సక్సెస్ కానీ సునీల్ ఆ రియాలిస్టిక్ -థ్రిల్లర్ కథతో ఏ స్థాయి విజయాన్నీ అందుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News