తెలుగు ప్రేక్షకులకు సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గత కొన్నేళ్లుగా తన మధురమైన వాయిస్ తో శ్రోతలను అలరిస్తూ వస్తోంది. గాయనిగా పాటలు పాడటమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎందరో హీరోయిన్లకు గొంతు అరువు ఇచ్చింది.
చాలాకాలంగా ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత.. తన పిల్లల అంగీకారంతో మ్యాంగో రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. రామ్ - సునీత వివాహం అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
పలువురు సినీ ప్రముఖులు సునీత - రామ్ దంపతులను అభినందిసస్తే.. మరొకొందరు మాత్రం వీరి సెకండ్ మ్యారేజ్ పై ట్రోలింగ్ చేశారు. పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని మళ్ళీ వివాహం చేసుకోవడం ఏంటంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. రెండో పెళ్లి సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్ మరియు నెగటివ్ కామెంట్స్ పై స్పందించింది. అలానే ఆమె కెరీర్ మరియు పర్సనల్ లైఫ్ కి సంబంధించి పలు విషయాలు షేర్ చేసుకుంది.
ట్రోలింగ్ గురించి సునీత మాట్లాడుతూ.. ''మీరందరూ అంటుంటారు కదా.. చిత్ర గారి తర్వాత 121 మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పిందని అంటారు.. చాలామంది ఎంటర్టైన్మెంట్ కి నేను కారణమని అంటారు. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు ఒకరి పర్సనల్ లైఫ్ పై ఎందుకు ఫోకస్ చేస్తుంటారు?'' అని ప్రశ్నించింది.
"సంస్కార వంతుల లక్షణం ఏంటంటే.. ఒక మనిషిని ఓ మాట అనే ముందు.. వాళ్ళేం మాట్లాడుతున్నారో ఒక్క నిమిషం ఆలోచించాలి" అని సునీత పేర్కొంది. ఈ సందర్భంగా తన మెంటర్ లెజండరీ సింగర్ దివంగత బాలసుబ్రహ్మణ్యం అని తెలిపింది.
ఒకానొక సమయంలో తాను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాయని.. ఎస్పీబీ దాన్నుంచి బయటకు తీసుకొచ్చి స్ట్రాంగ్ గా ఉండటానికి కారణమయ్యారని చెబుతూ సునీత భావిద్వేగానికి గురయ్యారు.
అలానే దివంగత నటి సౌందర్య కు డబ్బింగ్ చెప్పిన విషయాన్ని సునీత గుర్తు చేసుకుంది. సౌందర్య ఎవరికైనా తనని పరిచయం చేయాలంటే.. 'నేను సౌందర్య.. ఇది నా వాయిస్' అని అనేవారని చెప్పుకొచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.