సినీ సెలబ్రిటీల సినిమాల విషయాలతో పాటు వారి వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతుంటారు అభిమానులు.. సామాన్యులు. ఏ సమాచారం బయటికి రాకపోతే లేనిపోనీ పుకార్లు పుట్టించేస్తారు. ముఖ్యంగా విడాకులు తీసుకొని ప్రస్తుతం సమాజంలో అలాగే ఇండస్ట్రీలో రెండవ పెళ్లి గురించి వార్తలలో నిలుస్తున్నారు సినీ ప్రముఖులు యాంకర్ ఝాన్సీ, సింగర్ సునీత. వీరిద్దరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకొని ప్రస్తుతం పిల్లలకు మాతృ ప్రేమను పంచుతున్నారు. అయితే ఎదుటివారి పర్సనల్ విషయాలలో ఎవరు కూడా తలదూర్చడం మంచిది కాదు. కానీ వీరిద్దరి విషయంలో మీడియా కాస్త ఎక్కువగా చొరవ తీసుకున్నట్లు అనిపిస్తుంది. వారి పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో ఎవరికీ తోచిన కథనాలు వారు రాయడంతో యాంకర్ ఝాన్సీ, సునీతలు స్పందించక తప్పలేదు.
వారిద్దరూ కూడా వారి పర్సనల్ లైఫ్ గురించి.. అలాగే రెండవ పెళ్లి అనే పుకార్ల పై స్పందించారు. సింగర్ సునీత కొన్ని వ్యక్తిగత కారణాలతో చాలా ఏళ్లుగా తన భర్తకు దూరంగా ఉంటుంది. ఇదివరకే సునీత ఇతరుల పర్సనల్ విషయాల పట్ల ఎందుకంత ఆసక్తి కనబరుస్తారని.. ఇదే విషయంలో ప్రశ్నించింది. ఇక తాజాగా ఆమె మాట్లాడుతూ.. "ప్రస్తుతం లైఫ్ ఒంటరిగా హ్యాపీగానే ఉంది. ఇద్దరు పిల్లలు, నేను హ్యాపీ ఫ్యామిలీ. ఇక మరో పెళ్లి విషయం అంటారా.. అదేమో గాని మా జీవితంలో ఎలా రాసి ఉంటే అదే జరుగుతుంది" అని చెప్పింది. ఇక జోగినాయుడుతో విడాకులు అయిన తర్వాత ఝాన్సీ తన బిడ్డతో ఒంటరిగా ఉంటోంది. రెండేళ్ల క్రితమే జోగినాయుడు మరో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఝాన్సీ తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ.. "నాపై వచ్చిన పుకార్లను బట్టి జనాలు ఆల్రెడీ వాళ్ల అభిప్రాయాలు ఏర్పరచుకొని ఉంటారు. మీడియాలో ఎన్నో కథనాలు వారు చదివి వాళ్లకు వాళ్ళే సమాధానం రాసుకుంటారు. ఇప్పటికే సమాజంలో కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నేనేం చెప్పినా జనాలకు అనవసరం. కాబట్టి వాళ్లను నిరాశ పరచను. కానీ మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పకుండా చెబుతాను" అంటూ చెప్పుకొచ్చింది.