ఒక్క రోజు ముందు ప్రముఖ గాయని సింగర్ సునీత తనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. అయితే స్వల్ప లక్షణాలే ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవడంతో క్యూర్ అయ్యానంటూ ఒక వీడియోను విడుదల చేసింది. కరోనా గురించి ఆందోళన అక్కర్లేదని చాలా మంది భయాందోళనకు గురి అవుతున్నారు. నా ఆరోగ్యం గురించి కొందరు ఆందళన చెందుతూ కాల్స్ మెసేజ్ లు చేస్తున్నారు. వారందరికి కృతజ్ఞతలు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుంది. ఎలాంటి ఆందోళన లేదు. కాని నా ఆందోళన అంతా కూడా బాలు గారి గురించే అంటూ సునీత వీడియోలో చెప్పింది. అయితే ఆ వీడియోకు పెద్ద ఎత్తున బ్యాడ్ కామెంట్స్ వచ్చాయట.
కరోనా వస్తే హాస్పిటల్ కు వెళ్లి చావాలి కాని దానికి కూడా పబ్లిసిటీ అవసరమా.. మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవడం ఎందుకో అంటూ కొందరు.. తెలుగు పాటలు బాగానే పాడుతావు కదా మరీ అంతగా ఇంగ్లీష్ మాట్లాడటం ఏంటో ఫ్యాషన్ అనుకుంటున్నావా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. దాంతో ఆమె సీరియస్ గా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఈసారి వీడియో పోస్ట్ కాకుండా టెక్ట్స్ పోస్ట్ పెట్టారు. కరోనా అవగాహణ కోసం తాను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. కాని అవన్ని చెప్తే మరెన్ని వినాల్సి వస్తుందో అనే ఉద్దేశ్యంతో ఆ విషయాలను చెప్పాలనుకోవడం లేదు అంటూ సునీత పేర్కొన్నారు.
సింగర్ సునీత ఫేస్ బుక్ పోస్ట్... అందరికీ నమస్కారం. మొన్న నేను పెట్టిన వీడియో కి స్పందించి నా బాగోగులు కోరుకున్న నా అభిమానులందరికి కృతజ్ఞతలు ఈ వీడియో youtube చెక్కర్లు కొడుతోంది. మంచిది. నేను తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా పాటలు పాడటం వలన అక్కడకూడా అభిమానులు నాతో మాట్లాడుతూ వుంటారు. అందరికీ ఒకేసారి విషయం తెలుస్తుందని ఎక్కువ ఆంగ్లంలో మాట్లాడటం జరిగింది. కానీ విషయం వదిలేసి సమాజం లో ఉన్న చాలా మంది న్యాయనిర్ణేతలు(కోర్టు లో ఉండేవారు కాదు) "ఏ తెలుగు రాదా, ఫ్యాషన్ ఆ, కారోనా వస్తే ముందు హాస్పిటల్ కి వెళ్లి చావు మీడియా లో పబ్లిసిటీ కోసం అవసరమా" లాంటి తీర్మానాలు చేస్తుంటే ఈరోజు నుండి కారోనా గురించి నా అనుభవం మరియు నేను కల్పించాలనుకున్న అవగాహన కార్యక్రమాలు విరమించుకుంటున్నాను. ఇంకా ఏం వినాల్సొస్తుందో .. వున్నవి చాలవా...