అక్క‌డ `RRR` రీమేక్ కు భారీ డిమాండ్‌!

Update: 2022-09-07 00:30 GMT
రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా మ‌ల్టీస్టార‌ర్ `RRR`. మెగా ప‌వ‌ర్ స్టార్ కామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల తొలి కల‌యిక‌లో రూపొందిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించింది. 1920 కాలంలో ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేప‌థ్యంలో ఇద్ద‌రు లెజెండ్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల ఫిక్ష‌న‌ల్ క‌థ‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ తో పాటు స్టార్ల‌ని కూడా అబ్బుర ప‌రిచి శ‌భాష్ అనిపించుకుంది.

నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని వీక్షించిన హాలీవుడ్ స్టార్స్‌, టెక్నిషియ‌న్స్ సినిమా గురించి సోష‌ల్ మీడియా వేదిగా ఇప్ప‌టికీ ప్ర‌చారం చేస్తూ సినిమాపై, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై ఈ మూవీలో న‌టించిన రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్ గా ప్రేక్ష‌కులు, సెల‌బ్రిటీల దృష్టిని ఆక‌ర్షించి నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూ రికార్డు సృష్టించింది. అయితే ఈ మూవీపై ఇప్పుడు కొరియ‌న్ మేక‌ర్ల దృష్టి ప‌డింద‌ట‌.  

ఈ విష‌యాన్ని తాజాగా `సాకిని డాకిని` మూవీ నిర్మాత‌ల్లో ఒక‌రైన సునీత తాటి వెల్ల‌డించారు. కొరియ‌న్ మూవీ `మిడ్ నైట్ ర‌న్న‌ర్స్` ఆధారంగా ఈ మూవీని తెలుగులో డి. సురేష్ బాబుతో క‌లిసి సునీత తాటి నిర్మించారు. నివేదా థామ‌స్‌, రేజీనా కాసండ్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కించారు. రోమ్ కోమ్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీని సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సునీత తాటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు.

మ‌న వాళ్లు కొరియ‌న్ సినిమాల‌ని ఫ్రీమేక్ లుగా, అఫీషియ‌ల్ రీమేక్ లు గా చేస్తుంటే కొరియ‌న్ లు మాత్రం మ‌న `RRR`పై మ‌న‌సు ప‌డ్డార‌ట‌. `RRR` ని కొరియాలో రీమేక్ చేస్తామంటూ నిర్మాత సునీత తాటి త‌గ్గ‌రికి బిగ్ డీల్ ని తీసుకొచ్చార‌ట‌. అయితే తాను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో చ‌ర్చించి వెల్ల‌డిస్తానని చెప్పార‌ట‌. ఆ త‌రువాత ఇదే విష‌యాన్ని రాజ‌మౌళికి సునీత తాట వివ‌రించార‌ట‌. అయితే ఆయ‌న రియాక్ష‌న్ ఏంట‌న్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి సస్పెన్స్ అని తెలిసింది.  

అన్నీ కుదిరి జ‌క్క‌న్న గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే `RRR` కొరియాలో హంగామా చేయ‌డం ఖాయం అని టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి ఇందుకు జ‌క్క‌న్న ఒప్పుకుంటాడా?  కొరియ‌న్ మేక‌ర్ల డీల్ కు సై అంటాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News