సన్నీ.. బ్యాటు పట్టుకుని ఊపేసింది

Update: 2015-12-18 04:24 GMT
క్రికెట్ మ్యాచ్ లో చీర్ లీడర్స్ కనిపించగానే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఒకవేళ సన్నీలియోన్ కానీ.. చీర్ లీడర్ గా చిందులేస్తే ఎలా ఉంటుంది ? ఊహించుకోడానికే మాంచి రంజుగా ఉంది కదూ. ఇది నిజం కాబోతోంది కూడా. ఎలాగంటారా.. సన్నీ లియోన్ ఇప్పుడు క్రికెట్ లీగ్ చెన్నై టీం ని కొనేసింది.

క్రికెట్ లీగ్ లో చెన్నై టీం అనగానే.. ఐపీఎల్ లో చెన్నై టీం రద్దయిపోయిందిగా.. అనుకోకండి. ఇప్పుడు సన్నీ జాయిన్ అయిన క్రికెట్ లీగ్ పేరు.. బీసీఎల్. అంటే బాక్స్ క్రికెట్ లీగ్ అన్నమాట. ఏక్తాకపూర్ కోసం సన్నీ ఇలా ఓ టీంకి ఓనర్ అయిపోయింది. ఈ లీగ్ లో ప్లేయర్స్ అందరూ సిల్వర్ స్క్రీన్ పై కనిపించే వాళ్లే కావడం విశేషం. ఈ బాక్స్ క్రికెట్ లో సన్నీ టీం పేరు చెన్నై స్వాగర్స్. రిత్విక్ ధంజ్వానీ - మౌనీ రాయ్ - సంగ్రామ్ సింగ్ వంటి టీవీ పాపులర్ టీవీ స్టార్లు.. ఈ సెక్సీ బ్యూటీ టీంలో మెంబర్లు.

పనిలో పనిగా బాక్స్ క్రికెట్ లీగ్ ఈవెంట్ సన్నీ లియోన్ క్రికెట్ కూడా ఆడేసింది. బౌలింగ్ చేసింది, బ్యాటింగ్ చేసింది.. ఇంకా చాలానే హంగామా చేసింది. గురి చూసి కొట్టడం కుదరలేదు కానీ.. బ్యాట్ మాత్రం బాగా అనుభజ్ఞురాలి లాగానే ఊపింది లెండి. ఈ హంగామా అంతా అయ్యాక కాసిన్ని కబుర్లు కూడా చెప్పింది.  "నాకు ఈ ఆట గురించి పెద్దగా తెలీదు కానీ.. నేను సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ ని. నేను పెద్దగా క్రికెట్ చూడకపోయినా.. మా నాన్న చాలానే చెప్పేవారు. ఒకవేళ ఆయన బతికుంటే.. ఇది ఆయన కోసమే అయ్యేది" అనేసి హార్ట్ టచ్ చేసేసింది సన్నీ.
Tags:    

Similar News