సన్నీ కండోమ్ యాడ్.. వాళ్లు హర్టయ్యారు

Update: 2017-04-17 16:33 GMT
సన్నీ లియోన్ పేరెత్తితే చాలు.. చాలామంది మనోభావాలు దెబ్బ తినేస్తాయి. పోర్న్ స్టార్ భారతీయ సినిమాల్లో నటించడం ఏంటంటూ మొదలైన అభ్యంతరాలు.. అనేక విషయాల్లో కొనసాగుతున్నాయి. తాజాగా ఆమె నటించిన కండోమ్ యాడ్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రకటనపై రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎ) మహిళా విభాగం నేతలు మండి పడుతున్నారు. ఈ ప్రకటనలో మహిళల్ని కించపరిచేలా.. అనైతికంగా చూపించారని.. ఇలాంటి ప్రకటనల్ని టీవీల్లోకి అనుమతించడం దారుణమని వారు అన్నారు.

టీవీల్లో ఇలాంటి ప్రకటనలు చూడటం మహిళా ప్రేక్షకులకు ఇబ్బందికరమని వారు వ్యాఖ్యానించారు. అసభ్యకరంగా ఉన్న ఈ కండోమ్ యాడ్.. ప్రజల్లోకి తప్పుడు సందేశం తీసుకెళ్లేలా ఉందని, దీన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. పలు టీవీ చానళ్లలో ఈ యాడ్‌ యథేచ్ఛగా ప్రసారమవుతోందని.. ఇంటిల్లిపాదీ టీవీ చూస్తున్నపుడు ఈ ప్రకటన ప్రసారమైతే ఛాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆ పార్టీ నేత షీలా అన్నారు. ఈ ప్రకటనపై చాలామంది మహిళా ప్రేక్షకులతో పాటు తమ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. వారం రోజుల్లోపు సన్నీలియోన్‌ యాడ్‌ ను నిషేధించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు ప్రభుత్వానికి అల్లిమేటం విధించారు. మరి ఈ యాడ్ పై బ్యాన్ పడుతుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News