యంగ్ టైగర్ ఎన్టీఆర్ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'టెంపర్' బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కాలేదు గానీ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మరపురాని సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమా రిలీజ్ అయిన చాలా ఏళ్ళ తర్వాత హిందీ లో రణవీర్ సింగ్ హీరో గా 'సింబా' పేరుతోనూ.. తమిళంలో విశాల్ హీరోగా 'అయోగ్య' పేరుతోనూ తెరకెక్కడం విశేషం.
తమిళ సినిమా గురించి మాట్లాడుకుంటే ఎఆర్ మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకుడు. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. విశాల్ కోసం దర్శకుడు ఒక పవర్ ఫుల్ మాస్ ఐటెం నెంబర్ ప్లాన్ చేశాడట. అందుకోసం హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ని సంప్రదించడం.. వెంటనే ఆమె తనదగ్గరున్న గ్రీన్ కర్చీఫ్ ని ఊపడం చకచకా జరిగాయట. విశాల్ లాంటి మాస్ హీరో.. సన్నీ లాంటి సెక్సీ బ్యూటీ తో కలిసి స్టెప్పులేస్తే అక్కడి జనాలు రొంబ హాట్ అప్పా.. అనకుండా ఉంటారా?
ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర కీలక పాత్రలలో పార్తిబన్.. డైరెక్టర్ కెఎస్. రవి కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీత దర్శకుడు. తమిళ నాట పొంగల్ పండగ కి రిలీజ్ చేస్తారని సమాచారం. యాక్షన్ సినిమాలకు విశాల్ పెట్టింది పేరు.. సో ఈ రీమేక్ హిట్ అయ్యే ఛాన్స్ లు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే.. మళ్ళీ విశాల్ దీన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి 'నా పేరు దయ.. నాకు లేందే అది'.. 'నీకు ఇగో లోపలే ఉంటదేమో..నాకు నాచుట్టూ వైఫై లా ఉంటది' అని మనకి తిరిగి చెప్తేనే కష్టం!