మగవాళ్లూ 'మీటూ' అనాలంటున్న సన్నీ

Update: 2020-01-03 10:35 GMT
హాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌ వరకు అన్ని వుడ్స్‌ లో కూడా ఆడ వారిపై లైంగిక వేదింపులు జరుగుతున్నాయి. ఒక్క సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా అన్ని చోట్ల కూడా ఆడవారిని అణచివేసేందుకు లేదంటే వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆ లైంగిక వేదింపుల నుండి బయట పడేందుకు ఆడవారికి దొరికిన అద్బుతమైన ఆయుదం మీటూ. ఇండియా లో గత ఏడాది మీటూ ఉద్యమం ఒక రేంజ్‌ లో సాగిందని చెప్పుకోవచ్చు. మీటూ ఉద్యమం కారణంగా లేడీస్‌ లైంగిక వేదింపులు చాలా వరకు తగ్గాయంటున్నారు.

లైంగిక వేదింపులపై మాజీ పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌ స్పందించింది. ఇండస్ట్రీలో వేదింపులు అనేవి చాలా కామన్‌ గా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. ఆ మాటలకు వస్తే ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా లైంగికంగా వేదింపులను ఎదుర్కొంటున్నట్లుగా ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది. కాని మగవారు లైంగిక వేదింపులను లైట్‌ తీసుకుంటున్నారని.. వారు అవకాశాల కోసం సైలెంట్‌ గా ఉంటున్నారు అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

లైంగిక వేదింపులను ఆడ అయినా మగ అయినా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గళం ఎత్తాలంటూ పిలుపునిచ్చింది. ఉన్నట్లుండి సన్నీలియోన్‌ మగవారి పక్షాణ నిలబడి మగవారు ఎదుర్కొంటున్న లైంగిక వేదింపులకు పరిష్కారం మీటూ అంటూ మాట్లాడటం అందరికి ఆశ్చర్యంగా ఉంది. అయితే సన్నీలియోన్‌ వ్యాఖ్యలపై కొందరు స్పందిస్తూ మొదట ఆడవారు ఎదుర్కొంటున్న లైంగిక వేదింపుల సమస్య పరిష్కారం అయిన తర్వాత మగవారి సమస్యల గురించి ఆందోళనలు చేద్దాం అంటున్నారు.
Tags:    

Similar News