శృంగార తార‌నే బ‌ల‌వంతం చేశారా!

Update: 2020-05-06 09:30 GMT
ఇష్టం లేక‌పోయినా బ‌ల‌వంతం చేస్తే ఆ ప‌ని ఎలా ఉంటుందో తెలుసు క‌దా! ఇదిగో ఇక్క‌డ స‌న్నీలియోన్ ప‌రిస్థితి అలానే ఉంది మ‌రి. స‌ద‌రు శృంగార తారను ఎవ‌రో బ‌ల‌వంతం చేసిన‌ట్టుగానే ఉంది. చేతిలో చీపురుతో బ‌ల‌వంతంగా ఇలా చేస్తోంది ప‌ని. ఎన్ని ఆప‌సోపాలు ప‌డుతోందో చూస్తున్నారా?  ఇంత‌కీ స‌న్నిలియోన్ కి అలాంటి స‌న్నివేశం ఎందుక‌ని ఎదురైంది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

గ‌త కొంత‌కాలంగా సెల‌బ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లంతా ఎవ‌రికి వారు క‌రోనాని త‌రిమికొట్టేందుకు స్వీయ నిర్భంధంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ శృంగార తార స‌న్నీలియోన్ సైతం త‌న భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్ .. పెంప‌కం పిల్ల‌ల‌తో క‌లిసి క్వారంటైన్ లో ఉంది. ఇక ఈ స‌మ‌యంలో భ‌ర్త పిల్ల‌ల‌తో స‌న్నీ ఎలా టైమ్ పాస్ చేస్తోందో ఆవిష్క‌రించే ఫోటోలు వీడియోలు ఇన్ స్టాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా సన్నీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ కొత్త‌ వీడియోను షేర్ చేసింది. ఇంట్లో నేల‌ను శుభ్ర‌ప‌రుస్తోంది స‌న్నీ. బ్లాక్ క‌ల‌ర్ చిట్టి పొట్టి దుస్తుల్లో స‌న్నీ క‌ద‌లిక‌లు కుర్ర‌కారుకు కిర్రెక్కించాయి. వేడెక్కించే ఈ పొట్టి డ్రెస్ కి కాంబినేష‌న్ గా ఆ ఆభరణాలు.. హైహీల్స్ ని ధరించి మ‌త్తెక్కించింది. తాజా వీడియోకి స‌న్నీ ఇచ్చిన క్యాప్ష‌న్ అదిరింది. ``హమ్మయ్య .... నేను బలవంతంగా తుడుస్తుంటే.. అప్పుడు ... # లాక్ అప్ విత్ స‌న్నీ`` అన్న వ్యాఖ్య‌ను జోడించింది. కేవ‌లం కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో అంత‌ర్జాలంలోకి దూసుకెళ్లింది. ఈ వీడియో వీక్షించిన యూత్ లో చాలా మంది గుండెను ట‌చ్ చేశావ్! అంటూ ల‌వ్ ఎమోజీలను స‌న్నీకి షేర్ చేశారు.

భర్త డేనియల్ వెబెర్ వారి ముగ్గురు పిల్లలైన నిషా- నోహ్- ఆషర్లతో నిర్బంధంలో ఉన్న సన్నీ ఇలా క్రియేటివ్ యాక్టివిటీస్ తో బిజీగా ఉన్నారు. తీరిక వేళ‌లో పిల్లలతో గడపడం.. ఇంటి పనులు చేయడం.. లాక్ అప్ విత్ సన్నీ అనే ఆన్ లైన్ చాట్ షోను నిర్వ‌హించ‌డం వ‌గైరా వ‌గైరా ప‌నులు చ‌క్క‌బెడుతోంది. ఇక స‌న్నీలియోన్ కెరీర్ సంగ‌తి చూస్తే.. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్` సీజన్ 2 అనే వెబ్ సిరీస్ లో హన్నీజీ అనే ప్రత్యేక డ్యాన్స్ నంబర్ ‌లో సన్నీ చివరిసారిగా కనిపించింది. తదుపరి బాలీవుడ్ లో `కోకా కోలా` అనే హర్రర్ కామెడీ చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో ఆమె మందనా కరిమితో కలిసి నటించనుంది. ఈ చిత్రానికి ప్రసాద్ తాతినేని దర్శకత్వం వహిస్తున్నారు.Full View
Tags:    

Similar News