మెగా ఫ్యామిలీ నుండి 'విజేత' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ మొదటి ప్రయత్నం విఫలం అవ్వడంతో తదుపరి సినిమాకు కాస్త సమయం తీసుకున్నాడు. మంచి కథతో పాటు దర్శకుడిని ఎంపిక చేసుకుని మొదలు పెట్టిన చిత్రం 'సూపర్ మచ్చి'. ఈ సినిమా కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా షూటింగ్ ముగిసి చివరి దశ పనుల్లో ఉంది. సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి ఈ సినిమా గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సూపర్ మచ్చి అంటూ ఒక సూపర్ హిట్ పాటలోని పల్లవి పదాలను పెట్టడం వల్ల ఖచ్చితంగా సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు పెరిగి పోయాయి. అంచనాలు భారీగా పెరిగిన సూపర్ మచ్చి నుండి దీపావళి స్పెషల్ గా టీజర్ వచ్చింది.
సూపర్ మచ్చి టీజర్ లో పూర్తి స్థాయి మాస్ మసాలా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ను చూపించడం జరిగింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అన్ని ఎమోషన్స్ ను చక్కగా చూపించారు. ఆ ఎమోషన్స్ ను సన్నివేశాలను థమన్ చాలా బాగా ఎలివేట్ అయ్యేలా మ్యూజిక్ ఇచ్చాడు. మొదటి సినిమాతో పోల్చితే కళ్యాణ్ దేవ్ లో స్టైల్ నుండి మొదలుకుని డాన్స్ వరకు అన్ని విషయాల్లో కూడా మార్పు వచ్చినట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కళ్యాణ్ దేవ్ ప్రేక్షకులతో సూపర్ మచ్చి అనిపించేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ సినిమాకు ప్రమోషన్స్ చేసి విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా లో కళ్యాణ్ దేవ్ కు జోడీగా రచిత రామ్ హీరోయిన్ గా నటించింది. ఆమె ను కూడా టీజర్ లో చూడవచ్చు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కళ్యాణ్ దేవ్ కు జోడీగా ఆమె పర్ఫెక్ట్ గా సూట్ అయ్యిందనిపిస్తుంది. ఇక ఈ సినిమా కు పులి వాసు దర్శకత్వం వహించాడు. ఒక పక్కా కమర్షియల్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. కళ్యాణ్ మొదటి సినిమా నిరాశ పర్చిన నేపథ్యంలో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ ను అందుకోవాలనే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువ శ్రద్ద తీసుకుని మరీ ఈ స్క్రిప్ట్ ను రెడీ చేశాడని తెలుస్తోంది. రిజ్వాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమా యూనిట్ సభ్యులు దీపావళి శుభాకాంక్షలు అయితే చెప్పారు కాని విడుదల తేదీని మాత్రం వెళ్లడించలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేస్తారేమో చూడాలి.
Full View