వీడియో : వినరో భాగ్యము విష్ణుకథ నుండి సూపర్‌ మెలోడీ వాసవ సుహాస 

Update: 2022-12-22 05:48 GMT
యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా కాశ్మీరా హీరోయిన్‌ గా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా నుండి వాసవ సుహాస పాట విడుదల కాబోతుంది. డిసెంబర్‌ 24వ తారీకున ఈ పాటను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

వాసవ సుహాస పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఒక పండుగ నేపథ్యంలో.. స్వామివారి ఊరేగింపులో భాగంగా ఈ పాట వస్తుందని ప్రోమో చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.

చాలా కలర్ ఫుల్‌ గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఈ పాట ప్రోమో ఉంది. ప్రోమో సూపర్ మెలోడీ గా ఉండటంతో పూర్తి పాట కోసం వెయిట్‌ చేసేలా ఉంది.

ఈ పాటకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందించగా.. కారుణ్య ఈ పాటను ఆలపించారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాట కోసం సాహిత్యాన్ని అందించారు. సినిమా యొక్క మొత్తం థీమ్ ను ఇందులో చూపిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఈ పాట సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుంది.

టైటిల్ కు తగ్గట్లుగా ఈ సినిమా లో ఆద్యాత్మిక విషయాలతో పాటు ఒక ఆకట్టుకునే మంచి కమర్షియల్‌ లవ్‌ స్టోరీ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మురళి కిషోర్‌ అబ్బూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను బన్నీ వాసు నిర్మించడంతో పాటు అల్లు అరవింద్ సమర్పిస్తున్న కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి.

పాట విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News