సూపర్ స్టార్ మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోడానికి వ్యాపార సంస్థలు పోటీ పడుతుంటాయి. ప్రస్తుతం మహేష్ చేతిలో ఉన్నన్ని ఎండార్స్మెంట్స్ మరో టాలీవుడ్ హీరోకి లేవనడంలో అతిశయోక్తి లేదు. సంతూర్ - థమ్స్ అప్ - లాయిడ్ - పాన్ బహార్ - హెల్త్ ఓకే - ఫ్లిప్ కార్ట్ వంటి ఎన్నో బ్రాండ్స్ మహేష్ చేతిలో ఉన్నాయి. ఈ క్రమంలో 'కింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్' మహేష్ తాజాగా మరో కార్పోరేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశారు.
ప్రముఖ మొబైల్ రిటైల్ బ్రాండ్ 'బిగ్ సి' తో మహేష్ బాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్ల విక్రయాల్లో అత్యధిక వాటాను కలిగి ఉన్న 'బిగ్ సి' మొబైల్స్.. మహేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నందుకు గానూ భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారని తెలుస్తోంది. 19 ఏళ్ల చరిత్రలో ఇప్పటికే ఎంతోమంది సినీ స్టార్స్ ను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకున్న 'బిగ్ C'.. మొదటిసారిగా సూపర్ స్టార్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొన్నారు. ఇది రాబోయే దసరా - దీపావళి సీజన్స్ లో తెలుగు రాష్ట్రాల్లో మొబైల్స్ అమ్మకాలకు బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
'బిగ్ సి' మొబైల్స్ కోసం మహేష్ బాబు సంతకం చేసిన సందర్భంగా ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. పాండమిక్ టైంలో ఆన్ లైన్ క్లాసుల కోసం పిల్లలకు సైతం మొబైల్ ఫోన్స్ - లాప్ టాప్స్ అవసరం ఏర్పడిందని అన్నారు. బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తానే సెలెక్ట్ చేసుకుంటానని.. సతీమణి నమ్రత శిరోద్కర్ మేనేజ్ చేస్తుందని మహేష్ తెలిపారు. యాపిల్ రిలీజ్ చేసే ప్రతీ కొత్త ఫోన్ కొంటానని.. తన మొబైల్ లో ఎలాంటి సీక్రెట్స్ ఉండవని ఈ సందర్భంగా అన్నారు.
ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' పాత్రలో డిఫరెంట్ మహేష్ ని చూస్తారని.. ఈ సినిమాని పప్రేక్షకులకు చూపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. షూటింగ్ ఇప్పటికే 60-70% కంప్లీట్ అయిందని వెల్లడించారు. 'దూకుడు' సినిమా పదేళ్లు పూర్తైన సందర్భంగా ప్రదర్శించిన స్పెషల్ షో లు హౌస్ ఫుల్ అవడం పట్ల మహేష్ సంతోషం వ్యక్తం చేశారు. తన పట్ల ఇంత ప్రేమాభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్ కి జీవితాంతం రుణపడి ఉంటానని సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు.