తెలుగు హీరోలు వరుసగా పాన్ ఇండియా రేంజ్ లో వందల కోట్ల వసూళ్లు దక్కించుకుంటున్న నేపథ్యంలో తమిళ స్టార్స్ కూడా పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ తమిళనాట వందల కోట్ల వసూళ్లు కురిపించగల సత్తా ఉన్న హీరో కానీ.. బయటి భాషల్లో మాత్రం ఆయన అయిదు పది కోట్లకే చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి.
ఇప్పటి వరకు తమిళేతర భాషల్లో సక్సెస్ అవ్వలేక పోయిన విజయ్ ఒక భారీ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తనకు ఇప్పటి వరకు మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్ లను ఇచ్చిన ప్రముఖ దర్శకుడు అట్లీ తో ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను విజయ్ చేయబోతున్నాడట. వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు కూడా వంద కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించాయి.
అందుకే మరో సినిమాను ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో చేసేందుకు సిద్ధం అయ్యారట. ప్రస్తుతానికి కథ మరియు ఇతర విషయాల గురించి ఎలాంటి చర్చ జరగలేదు. కేవలం అట్లీ చెప్పిన లైన్ కి విజయ్ ఓకే చెప్పాడట. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి విజయ్ ముందు ఉంచుతాను అంటూ ఇటీవలే అట్లీ సన్నిహితుల వద్ద అన్నాడట.
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను మూడు వందల కోట్లతో నిర్మించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం విజయ్ వారసుడు సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. మరో వైపు బాలీవుడ్ లో అట్లీ జవాన్ సినిమా చేస్తున్నాడు.
ఇద్దరు కూడా వారి వారి యొక్క ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకున్న తర్వాత భారీ పాన్ ఇండియా మూవీని పట్టాలెక్కించే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థం లో విజయ్.. అట్లీ ల యొక్క మూడు వందల కోట్ల బడ్జెట్ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.