సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ కాంబినేషన్ అంటే ఘట్టమనేని అభిమానుల్లో ఉండే క్రేజు వేరు. డాడీ సినిమాల్లో బాలనటుడిగా నటించిన మహేష్ ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగారు. ఇంతింతై అన్న చందంగా ఎదిగి అసాధారణ స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నారు. మహేష్ పెద్ద స్టార్ అయిన క్రమంలోనే కృష్ణ సినిమాల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన వయసు దృష్ట్యా సినిమాలకు దూరమయ్యారు.
కొందరు దర్శకుల అభ్యర్థన మేరకు అడపాదడపా అతిథి పాత్రల్లో కనిపించినా ఇటీవల పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే మరోసారి సూపర్ స్టార్ ని తెరపై చూసే అరుదైన అవకాశం ఘట్టమనేని అభిమానులకు కలగనుందా? అంటే అవుననే సమాచారం.
మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కార్ వారి పాట` మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్ షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తదుపరి షెడ్యూల్ గురించి సమాచారం రావాల్సి ఉంది. ఈలోగానే సూపర్ స్టార్ కృష్ణ గారు మళ్లీ నటిస్తున్నారు! అంటూ ప్రచారం సాగుతోంది.
ఇది నిజమా? అంటే... కానే కాదు. ఆగ్యూమెంట్ డె రియాల్టీ అనే టెక్నాలజీనీ ఉపయోగించి కృష్ణ గారిని విజువల్ గా రీక్రియేట్ చేసేందుకు పరశురామ్ ప్లాన్ చేస్తున్నారట. మహేశ్- కృష్ణ కాంబినేషన్ లో ఓ రసవత్తర సీన్ తెరకెక్కించనున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే కృష్ణ నేరుగా సెట్స్ కి వెళ్లి నటించకపోయినా... ఆయన విజువల్ క్రియేషన్ కి ఫ్యాన్స్ ఫిదా అవ్వడం ఖాయం. ఇంతకుముందు లెజెండరీ హీరో ఎన్టీఆర్ ని ఓ సాంగ్ కోసం ఇదే తరహా టెక్నాలజీలో క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇరుగు పొరుగు భాషల్లోనూ ఈ తరహా ప్రయోగాలు వెటరన్ హీరోల అభిమానుల్ని ఆకట్టుకున్నాయి.