మహేష్‌ ఆల్‌ టైం ఫేవరెట్‌ మూవీకి 55 ఏళ్లు

Update: 2020-03-31 17:30 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గతంలో పలు ఇంటర్వ్యూలో ఆల్‌ టైం ఫేవరెట్‌ చిత్రాల జాబితాలో ముందు వరుసలో నాన్నగారు కృష్ణ నటించిన మొదటి చిత్రం తేనెమనసులు ఉంటుందని చెప్పిన విషయం తెల్సిందే. తెలుగులో మొదటి పూర్తి స్థాయి సాంఫీుక చిత్రం  అదే అవ్వడం విశేషం. అలాగే మొదటి ఈస్ట్‌ మన్‌ కలర్‌ చిత్రం కూడా అదే. కృష్ణ మొదటి సినిమాతోనే ఎన్నో ప్రత్యేకతలను రికార్డులను తన సొంతం చేసుకున్నారు.

ఆ సినిమా విడుదలై నేటికి 55 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా మహేష్‌ బాబు మరోసారి ఆ సినిమా గురించి స్పందించారు. నా ఆల్‌ టైం ఫేవరేట్‌ సినిమా తేనెమనుసులు. ఎప్పటికి ఎవర్‌ గ్రీన్‌ అయిన సూపర్‌ స్టార్‌ కృష్ణగారి సినీ కెరీర్‌ ఈ సినిమాతో ప్రారంభం అయ్యింది. 55 ఏళ్ల క్రితం సినీ జీవితంను ఆయన ఈ సినిమాతో ప్రారంభించారు. ఆరంభమే బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం అద్బుతం. ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లేందుకు కొద్ది సమయంను కేటాయిద్దాం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఈ సినిమా అవకాశంపై గతంలో కృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లోకి రాకముందు నేను నాటకాలు వేసేవాడిని. నాటకాల అనుభవం ఉన్న నన్ను హీరోగా పరిచయం చేశారు. మొదటి సినిమాతోనే మంచి పేరు వచ్చింది. దాంతో వెనుదిరిగి చూసుకోలేదని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.
Tags:    

Similar News