సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు సమయం కేటాయిస్తాడు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న మహేష్ కొద్దిరోజుల క్రితం తన మ్యారేజ్ డే నాడు 650 మంది అంధత్వంతో బాధపడుతున్న పిల్లలకు విందు భోజనం పెట్టారు. తాజాగా మరో విషయంలో వార్తలలో నిలిచాడు మహేష్.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్వీన్ క్యాన్సర్ బాధితురాలు. పర్వీన్ కు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.. ఆ పాపకు మహేష్ ఫేవరేట్ స్టార్. తన అభిమాన హీరోను ఒక్కసారైనా కలవాలని కోరిక. ఈ సంగతి తెలుసుకున్న మహేష్ బాబు రీసెంట్ గా పర్వీన్ ను కలిసి.. కొంత సమయం గడిపారు. పర్వీన్ కు జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నారు. త్వరలో కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పర్వీన్ తో పాటు ఆ పాప కుటుంబ సభ్యులతోనూ ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చిన మరుక్షణం నుండి చాలామంది మహేష్ అభిమానులు పర్వీన్ క్యాన్సర్ ను జయించాలని కోరుకుంటూ 'గెట్ వెల్ సూన్' అంటూ మెసేజెస్ పెట్టారు. దీంతో పాటు అభిమాని కోరిక తీర్చిన మహేష్ మంచి మనసును మెచ్చుకుంటూ మహేష్ సినిమాల విషయంలోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టారేనని ఆకాశానికెత్తేస్తున్నారు.